RSS Chief: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నాగ్‌పూర్ వేదికగా దసరా ప్రసంగాన్ని ఇచ్చారు. గత కొన్నేల్లుగా మెరుగైన విశ్వసనీయతతో భారతదేశం ప్రపంచంలో మరింత పటిష్టంగా, మరింత గౌరవంగా మారిందని ఆయన అన్నారు. అయితే, దుష్ట కుట్రలు దేశ సంకల్పాన్ని పరీక్షిస్తున్నాయని శనివారం భగవత్ అన్నారు. బంగ్లాదేశ్‌లో భారత్‌కి ముప్పు పొంచి ఉందని, రక్షణగా పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్ చేతులు కలుపొచ్చని ప్రచారం జరుగుతోందని అన్నారు. పరిస్థితి అనుకూలంగా ఉన్నా.. లేకున్నా వ్యక్తిగత, జాతీయ స్వభావాల దృఢత్వం, ధర్మం…
RSS chief: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ హిందువులకు కీలక సూచన చేశారు. హిందువులు తమ సొంత భద్రత కోసం భాష, కులం, ప్రాంతం అనే అన్ని విభేధాలను మరించి వివాదాలను నిర్మూలించడం ద్వారా ఐక్యంగా ఉండాలి అని కోరారు. రాజస్థాన్ బరన్‌లో జరిగి ఆర్ఎస్ఎస్ వాలంటీర్లను ఉద్దేశించి భగవంత్ మాట్లాడుతూ.. హిందువులు అన్ని భేదాలను మరించి ఐక్యంగా ఉండాలని సూచించారు.
ప్రపంచం మొత్తానికి భారతదేశం అవసరం ఉంది.. దానికి అనుగుణంగా దేశం ఎదగాల్సిన అవసరం ఉందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఏదో ఒక కారణంతో భారత్ ఎదగలేకపోతే ఈ ప్రపంచం మొత్తం వినాశనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
మణిపూర్‌లో జరుగుతున్న హింసకు బాహ్య శక్తులే కారణమని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆరోపించారు. మణిపూర్‌లో కుట్రపూరితంగానే ఈ ఘటన అంతా జరిగిందన్నారు. నాగ్‌పూర్‌లో విజయదశమి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల మణిపూర్‌లో జరిగిన హింసాకాండను ప్రస్తావించారు.
Mohan Bhagwat: రాష్ట్రీక స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. మన సమాజంలో వివక్ష ఉందని, అసమానతలు ఉన్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగాలని బుధవారం ఆయన అన్నారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఓ సమావేశం ఆయన మాట్లాడారు. 1947లో భారతదేశంతో విడిపోయిన వారు తాము తప్పు చేస్తున్నామని భావిస్తున్న తరుణంలో నేటి యువకులు వృద్ధులుగా మారకముందే ‘అఖండ భారత్’, అవిభాజ్య భారతదేశం సాకారం అవుతుందని ఆయన అన్నారు.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఫిబ్రవరి 10న బీహార్‌లోని భాగల్‌పూర్ పర్యటనకు ముందు ఐఎస్‌ఐ, నక్సలైట్లు, ఛాందసవాదుల నుంచి బెదిరింపులు వచ్చినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆనంద్ కుమార్ తెలిపారు.