ప్రధాని మోడీ భక్తుడు, బీజేపీ వీర విధేయుడు మయూర్ ముండే మనస్తాపం చెందాడు. మోడీపై ఉన్న అభిమానంతో రూ.1.5లక్షలు వెచ్చించి ఆలయాన్ని నిర్మించాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే స్థానిక బీజేపీ నేతల తీరుతో ఇబ్బంది పడుతున్నట్లు వాపోయాడు. దీంతో మయూర్ ముండే కమలం పార్టీకి గుడ్‌బై చెప్పాడు.