దర్శక ధీరుడు రాజమౌళి అన్నంత పని చేశాడు. మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను దద్దరింప చేశాడు. 70 ఎం.ఎం. తెర మీద ‘ట్రిపుల్ ఆర్’ ట్రైలర్ చూసి మురిసిపోవాలనుకున్న యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల దాహార్తిని తీర్చాడు. ఇంతవరకూ భీమ్, రామ్ పాత్రలను పూర్తి స్థాయిలో జనాలకు చెప్పకుండా దోబూచులాడిన రాజమౌళి ఇప్పుడీ 3.07 నిమిషాల ట్రైలర్ లో ఆ క్యారెక్టర్స్ విషయంలో క్లారిటీ ఇచ్చాడు.…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్. ఈనెల 9న ఉదయం 10 గంటలకు ఈ మూవీ ట్రైలర్ తెలుగు రాష్ట్రాలలో ఎంపిక చేసిన థియేటర్లలో విడుదల కాబోతోంది. థియేటర్లలో విడుదలైన అనంతరం యూట్యూబ్‌లో అందుబాటులోకి రానుంది. ఈ ట్రైలర్ చూస్తే రామ్‌చరణ్, ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలు రావడం ఖాయమని ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. ఈ ట్రైలర్ నిడివి రెండున్నర నిమిషాలు ఉంటుందని తెలుస్తోంది. హైదరాబాద్…
“ఆర్ఆర్ఆర్” ఈరోజు వరుస అప్డేట్ లతో ప్రేక్షకుల దృష్టిని తమవైపుకు తిప్పుకునే పనిలో పడింది. సినిమా ప్రమోషన్స్ పరంగా సరికొత్త దారిలో వెళ్లే జక్కన్న ఈసారి కూడా అదే ప్రణాళికలో ఉన్నాడు. ఇప్పటికే “ఆర్ఆర్ఆర్” పేరుతో సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసిన టీం ఎప్పటికప్పుడు సినిమా అప్డేట్స్, పోస్టర్లు, సినిమాకు సంబంధించిన అంశాలతో పాటు నెటిజన్లతో సరదా సంభాషణలతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. మరో మూడు రోజుల్లో “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో…
దర్శక థీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ జనవరి 7వ తేదీ వరల్డ్ వైడ్ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ అందుకున్న ఈ సినిమా పబ్లిసిటీలో వేగాన్ని పెంచారు రాజమౌళి. యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం ఇందులో పూర్తి స్థాయిలో లీనమై, మూవీని మరో లెవెల్ కు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఈ…
“ఆర్ఆర్ఆర్” ట్రైలర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్. రాజమౌళి దర్శకత్వంలో మాగ్నమ్ ఓపస్ గా తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్” సినిమా ట్రైలర్ ను వాయిదా వేశారు మేకర్స్. ముందుగా ఈ ట్రైలర్ ను డిసెంబర్ 3న విడుదల చేయబోతున్నట్టుగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ ను వాయిదా వేస్తూ అధికారిక ప్రకటన చేశారు ‘ఆర్ఆర్ఆర్’ టీం. అనివార్య కారణాల వల్ల డిసెంబర్ 3న విడుదల కావాల్సిన ట్రైలర్ విడుదల వాయిదా వేస్తున్నాము. త్వరలోనే…