RRR మార్చి 25న గ్రాండ్ రిలీజ్ కాబోతోందన్న విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో మూవీ పెయిడ్ ప్రీమియర్లపై ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ‘RRR’ ప్రీమియర్ షోలను నిర్వహించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్ షోలకు సంబంధించి చిత్రబృందం అధికారుల నుంచి అనుమతులు కూడా పొందింది. అయితే తాజా బజ్ ప్రకారం RRR పంపిణీదారులు పెయిడ్ ప్రీమియర్లకు వ్యతిరేకత చూపుతున్నారని తెలుస్తోంది.…