RRR మార్చి 25న గ్రాండ్ రిలీజ్ కాబోతోందన్న విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో మూవీ పెయిడ్ ప్రీమియర్లపై ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ‘RRR’ ప్రీమియర్ షోలను నిర్వహించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్ షోలకు సంబంధించి చిత్రబృందం అధికారుల నుంచి అనుమతులు కూడా పొందింది. అయితే తాజా బజ్ ప్రకారం RRR పంపిణీదారులు పెయిడ్ ప్రీమియర్లకు వ్యతిరేకత చూపుతున్నారని తెలుస్తోంది. ప్రీమియర్ షోలు వారికి ఎక్కువ ఆదాయాన్ని చేకూరుస్తాయని తెలిసినా ఎందుకు వ్యతిరేకత వ్యక్తం అవుతోందని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
Read Also : HBD Mohanbabu : మోహన్ బాబు రూటే సెపరేటు!
మార్చి 24న సాయంత్రం 6 గంటలకు, రాత్రి 9 గంటలకు ప్రీమియర్లను ప్రదర్శించాలని దర్శకుడు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఐదవ షోకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అంగీకరించగా, మార్చి 25వ తేదీ ఉదయం 6 గంటల నుంచి షోలను ప్రారంభించే యోచనలో డిస్ట్రిబ్యూటర్లు ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రటకన రావాల్సి ఉంది. ఇక RRR స్వాతంత్ర్య సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల కల్పిత కథ ఆధారంగా రూపొందించబడింది. RRRలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, అజయ్ దేవగన్ వంటి దిగ్గజం నటీనటులు ఉన్న విషయం తెలిసిందే.