ఐపీఎల్ -16లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
కోహ్లీ.. రాహుల్ చాహర్ బౌలింగ్ లో రెండు పరుగులు తీయడం ద్వారా వ్యక్తిగత స్కోర్ 30 వద్ద ఓ రికార్డును అందుకున్నాడు. ఐపీఎల్ లో 100వ సారీ విరాట్ కోహ్లీ 30 ఫ్లస్ మార్క్ ను దాటాడు. ఈ క్రమంలో ఐపీఎల్ లో 30 ఫ్లస్ స్కోర్ చేసిన తొలి ఆటగాడిగా విరాట్ చరిత్ర సృష్టించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో పంజాబ్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొహాలీ వేదికగా తలపడుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్-16లో గురువారం మరో ఆసక్తికర పోరు జరగనుంది. గురువారం పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ పంజాబ్ హోమ్ గ్రౌండ్ మొహాలీలో జరగనుంది. ఈ మ్యాచ్ ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయపథంలోకి రావాలని కోరుకుంటోంది.