ఐపీఎల్ టోర్నీలో నేడు మరో రెండు బడా జట్ల మధ్య పోరు జరగనుంది. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్లు తలపడనున్నాయి. గత మ్యాచ్ ఓటమితో గెలుపు బాట పట్టాలని CSK కసరత్తు చేస్తోంది. మరోవైపు సొంతగడ్డపై మ్యాచ్ కావడంతో మరో విజయం నమోదు చేయాలని RCB భావిస్తోంది. ఇవాళ రాత్రి ఏడున్నరకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు జట్లు ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింట్లో…
IPL 2023 RCB Vs DC: ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ)పై రాయల్ చాలెంజర్స్ బెంగళూర్(ఆర్సీబీ) ఘన విజయం సాధించింది. 23 పరుగుల తేడాలో ఆర్సీబీ, డీసీని ఓడించింది. దీంతో ఐపీఎల్ 2023లో బెంగళూర్ రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి ఇన్సింగ్స్ లో ఆర్సీబీ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని డీసీ ఛేదించలేకపోయింది. ఏ దశలోనూ ఢిల్లీ గెలుస్తుందనే ఆశ నెలకొనలేదు. వరసగా బ్యాటర్లు ఔట్ అవ్వడంతో కుదురుకునేవారు ఒక్కరూ లేకపోయారు.
బిజీబిజీగా గడిపే టీమిండియా స్టార్, ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన గారాలపట్టి వామికాకు సమయం కేటాయించాడు. స్విమ్మింగ్ పూల్ లో తన చిన్నారి కూతురితో కలిసి సేద తీరుతున్న ఫోటోను కోహ్లీ మంగళవారం సోషల్ మీడియాతో కలిసి పంచుకున్నాడు.
ఐపీఎల్ లో ఇవాళ లక్నో సూపర్ జెయిట్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు తలపడనున్నాయి.