ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో పంజాబ్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొహాలీ వేదికగా తలపడుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తాము మొదట బౌలింగ్ చేస్తాము, చివరి గేమ్‌లో బాగా ఆడాము అని పంజాబ్ కెప్టెన్ సామ్ కర్రన్ అన్నారు. గత మ్యాచ్ తో మాకు కొంత విశ్వాసం వచ్చింది. టీమ్ పరిస్థితులు పెద్దగా బాగలేవు శిఖర్ ధావన్ గాయం కారణంగా మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు.. కానీ అతను ఈరోజు మిస్ అవుతాడు.. అతను మంచి ఆటగాడు, కానీ యువకులను తీర్చిదిద్దాలని మేం అనుకుంటున్నామని సామ్ కర్రన్ తెలిపారు. ఈ మ్యాచ్ లో లివింగ్‌స్టోన్ తిరిగి వచ్చాడు.. మేము KG స్థానంలో ఎల్లిస్‌ని తిరిగి గేమ్ లోకి తీసుకున్నామని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కర్రన్ వెల్లడించాడు.
Also Read : Anti-Hindu hate: బ్రిటన్ లో పెరుగుతున్న హిందూ వ్యతిరేకత.. మతం మారాలని ఒత్తిడి..
అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కి మళ్లీ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఇవాళ్టి మ్యాచ్ కి వ్యవహరించనున్నాడు. ఫాఫ్ డు ప్లెసిస్ ఈరోజు ఫీల్డింగ్ చేయలేరు.. కాబట్టి అతను వైషాక్‌తో కలిసి ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడతాడు. మేము కోరుకున్నది చేయాలి, మేము మొదట బ్యాటింగ్ చేస్తాము.. పిచ్ నెమ్మదిగా ఉంటుంది, కొన్ని స్క్రఫ్ మార్కులు గేమ్‌లోకి బలంగా వెళ్లడానికి బౌలర్‌లకు సహాయపడతాయి. ఒక్కోసారి ఒక్కో గేమ్‌ను తీసుకోవడం, మా స్వంత ఆటపై దృష్టి పెట్టడం వంటిది అని విరాట్ కోహ్లీ అన్నాడు. ఒక్కో దగ్గర ఒక్కో రకమైన పిచ్ ఉంటుంది అక్కడ ఇబ్బందికర పరిస్థితులను అనుకూలంగా ఆట ఆడితే మ్యాచ్ ను ఈజీగా గెలుస్తామని విరాట్ కోహ్లీ వెల్లడించాడు.
Also Read : CM Jagan Mohan Reddy:మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై జగన్ సమీక్ష