Rajasthan Royals Scored 92 Runs In First 10 Overs: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. తొలి 10 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 92 పరుగులు చేసింది. మొదట్లో జాస్ బట్లర్ వికెట్ రూపంలో రాజస్థాన్ జట్టుకి భారీ ఎదురుదెబ్బ తగిలినా.. ఓపెనర్ యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్ మెరుగా రాణిస్తున్నారు. ఆర్సీబీకి మరో వికెట్ ఇవ్వకుండా.. ఆచితూచి ఆడుతూ, తమ జట్టును ముందుకు నడిపిస్తున్నారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ.. మిగతా సమయాల్లో ఒకటి, రెండు పరుగులతో పరిణతి ఆట కనబరుస్తున్నారు. అనవసరమైన షాట్ల జోలికి అస్సలు వెళ్లడం లేదు. ఎంతైనా ఛేజింగ్ కాబట్టి.. వికెట్లు పడితే జట్టు ఒత్తిడికి గురవుతుంది కాబట్టి, వికెట్ పడనివ్వకుండా మెరుగైన ఇన్నింగ్స్ ఆడుతున్నారు.
RCB vs RR: ముగిసిన ఆర్సీబీ బ్యాటింగ్.. రాజస్థాన్ లక్ష్యం ఎంతో తెలుసా?
ముఖ్యంగా.. దేవదత్ పడిక్కల్ అద్భుత ఆటతీరు కనబరుస్తున్నాడు. ఈ సీజన్‌లో గత మ్యాచ్‌ల్లో చాలాసార్లు నిరాశపరిచిన అతగాడు.. ఈ మ్యాచ్‌లో మాత్రం చాలా గొప్పగా ఆడుతున్నాడు. ఆల్రెడీ ఫీల్డింగ్ పరంగా అదరహో అనిపించిన పడిక్కల్.. ఇప్పుడు బ్యాట్‌తోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. రాజస్థాన్ ఇదే జోరుతో సాగితే.. లక్ష్యాన్ని చేధించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఇక ఆర్సీబీ ఈ మ్యాచ్ గెలవాలంటే.. బౌలర్లందరూ తమదైన మ్యాజిక్ కనబర్చక తప్పదు. సిరాజ్, విల్లీ మాత్రమే కట్టుదిట్టమైన బౌలింగ్ వేస్తున్నారు. మిగతా బౌలర్లు మాత్రం భారీ పరుగులు సమర్పించుకుంటున్నారు. రాజస్థాన్ ఈ మ్యాచ్ గెలవాలంటే.. మరో 10 ఓవర్లలో 98 పరుగులు చేయాల్సి ఉంటుంది. అంటే.. ఓవర్‌కు 9.8 రన్ రేట్‌తో పరుగులు చేయాలన్నమాట. మరి.. ఎవరు ఎలాంటి ప్రదర్శనతో తమ జట్టుని విజయతీరాలకు చేరుస్తారో చూడాలి.
Island For Sale: అమ్మకానికి ఐలాండ్.. ధర రూ.1.5 కోట్లు మాత్రమేనట..