మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. అయితే రేపు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వద్ద గోదావరిలో రోశయ్య అస్తికలు నిమజ్జనం చేయనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో అస్తికలను కుటుంబ సభ్యులు రాజమండ్రికి తీసుకురానున్నారు. రేపు రోశయ్య అస్తికల నిమజ్జనం సందర్భంగా వర్తక, వ్యాపార వర్గాలు ఈ కార్యక్రమంలో పాల్గొని సంతాపం తెలపాలని…
రాజకీయ భీష్ముడు తెలుగు రాష్ర్టాల్లో మచ్చలేని మనిషిగా ఎదిగి రాజకీయల్లో తనదైన ముద్ర వేసిన మాజీ ముఖ్య మంత్రి కొణిజేటీ రోశయ్య అంత్య క్రియలు ఆదివారం మధ్యాహ్నం కొంపల్లిలోని తన ఫాంహౌస్‌లో పూర్తి అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించింది. ఆయన అంత్య క్రియలకు ప్రముఖులతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. ఆయనకు కన్నీట వీడ్కోలును పలికారు. రోశయ్య మరణంతో రెండు తెలుగు రాష్ర్టాల్లోని రాజకీయ నాయకులు ఒక గొప్ప…
రోశయ్య మరణం రాష్ర్టానికి, రాష్ర్ట రాజకీయాలకు తీరని లోటని మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు అన్నారు. రోశయ్యకు నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రోశయ్య గౌరవ ప్రదమైన వ్యక్తి అని ఆయన అన్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా, మంత్రిగా ఏపీకి ఎన్నో సేవలు అందించారన్నారు. చాలామంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసి ఆర్థిక వ్యవస్థకే వన్నె తెచ్చిన వ్యక్తి అని కొనియాడారు. రోశయ్య పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను జనరల్ సెక్రటరీగా ఉన్నానని గుర్తు చేసుకున్నారు.…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కె.రోశయ్య ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో రోశయ్య మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి, గీతారెడ్డిలు రోశయ్య కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. రోశయ్య మృతి చెందడం చాలా బాధకరమని, సుదీర్ఘ రాజకీయ అనుభవంలో.. ఎక్కడా మచ్చ తెచ్చుకోలేదు ఆయన అన్నారు. ఆర్థిక సమస్యలపై ఎంతో పట్టు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కె.రోశయ్య ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. రోశయ్య మృతిపట్ల రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోశయ్య కుమారుడికి ఏపీ సీఎం జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. అంతేకాకుండా రోశయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాటి ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలలో రోశయ్యది ఆదర్శప్రాయమైన జీవితమని, ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటు అని సీఎం జగన్ పేర్కొన్నారు. రోశయ్య మృతిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే…