మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. అయితే రేపు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వద్ద గోదావరిలో రోశయ్య అస్తికలు నిమజ్జనం చేయనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో అస్తికలను కుటుంబ సభ్యులు రాజమండ్రికి తీసుకురానున్నారు. రేపు రోశయ్య అస్తికల నిమజ్జనం సందర్భంగా వర్తక, వ్యాపార వర్గాలు ఈ కార్యక్రమంలో పాల్గొని సంతాపం తెలపాలని రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ పిలుపునిచ్చింది. దీంతో రేపు మధ్యాహ్నం వరకూ షాపుల బంద్ ప్రకటించారు.