Ajay Jadeja: ఆ విషయంలో రోహిత్ ఫెయిల్.. జడేజా సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajay Jadeja Shocking Comments On Rohit Sharma: రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ దిగ్విజయంగా దూసుకుపోతోంది. రికార్డ్ స్థాయిలో విజయాలు నమోదు చేసింది. కానీ.. ఫీల్డింగ్ విషయంలోనే విమర్శల్ని మూటగట్టుకుంటోంది. పేలవమైన ఫీల్డింగ్ కారణంగా.. కొన్ని మ్యాచెస్‌ని చేజేతులా పోగొట్టుకుంది. అంతెందుకు.. రీసెంట్‌గా టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా సౌతాఫ్రికా చేతిలో ఓడిపోవడానికి కారణం కూడా మిస్ ఫీల్డింగేనని చెప్పుకోవడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే భారత్ ఫీల్డింగ్‌పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ అంశంపై తాజాగా భారత మాజీ ఆటగాడు అజయ్ జడేజా కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్ పగ్గాలు విడిచిపెట్టినప్పటి నుంచి.. ఫీల్డింగ్ పరంగా భారత జట్టు వెనకపడిందని అన్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో బ్యాటింగ్, బౌలింగ్‌కు మెరుగులు దిద్దేందుకు జట్టు పరిమితమైందన్నారు.
‘‘ఆసియా జట్లు.. మరీ ముఖ్యంగా భారత జట్టు ఫీల్డింగ్ పరంగా ఏమాత్రం దృష్టి సారించడం లేదని అనిపిస్తోంది. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు.. ఫీల్డింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలనే మాట చివరిసారిగా విన్నా. అతడు ఫీల్డింగ్ బాగా చేయగలిగిన వారినే ఎంపిక చేసేవాడు. అయితే.. విరాట్ ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో పాటు కోచ్ కూడా మారిపోవడంతో.. ఫీల్డింగ్ విషయంలో భారత్ చతికిలపడింది. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మకు ఫీల్డింగ్ అంశంలో అంతగా పట్టింపు లేనట్టు కనిపిస్తోంది. అతడి దృష్టి కేవలం బ్యాటింగ్, బౌలింగ్ మీదే ఉంది. టీమ్‌ఇండియా ఆటగాళ్లలో అథ్లెట్లకు ఉండాల్సిన లక్షణాలు కొరవడినట్టు అర్థమవుతోంది’’ అంటూ జడేజా కుండబద్దలు కొట్టాడు. జట్టును ఎంపిక చేసే ముందు.. ఆటగాళ్ల నుంచి ఏం రాబట్టాలో కచ్ఛితంగా తెలుసుకోవడంలో, భారత జట్టు విఫలమైందని విమర్శించాడు.
Also Read
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
కాగా.. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చేతికి అందిన క్యాచ్‌ని వదిలేసిన సంగతి తెలిసిందే! కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఈజీ రనౌట్‌ని మిస్ చేశాడు. వీటితో పాటు మరికొన్ని మిస్ ఫీల్డ్స్ కూడా అయ్యాయి. ఈ తప్పిదాలు జరగడం వల్లే.. గెలవాల్సిన మ్యాచ్‌ని చేజేతులా వదులుకోవాల్సి వచ్చింది. ఒకవేళ ఆ తప్పిదాలు జరగకుండా ఉంటే, భారత్ కచ్ఛితంగా ఆ మ్యాచ్ గెలిచి ఉండేది. తద్వారా.. సెమీస్‌లో బెర్తు దాదాపు ఖరారు చేసుకునేది.
తాజావార్తలు
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..