Sunill Gavaskar: ఇక సీనియర్ల రిటైర్మెంట్లు ఉండొచ్చు.. హార్దిక్‌కు కెప్టెన్సీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunill Gavaskar: టీ20 వరల్డ్ కప్‌లో మొదటి నుంచి అద్భుతంగా రాణించిన టీమిండియా సెమీస్‌లో ఉసూరుమనిపించింది. టీమిండియా సెమీస్‌లోనే వెనుదిరగడంతో క్రీడాభిమానులు నిరాశను వ్యక్తపరస్తున్నారు. ఆటలో గెలుపోటములు సహజమే అయినా ఇంత దారుణంగా ఓడిపోవడాన్ని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బీసీసీఐ మొదలుకొని కోచ్‌లు, ఆటగాళ్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను లక్ష్యంగా చేసుకుని ట్రోల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు.
Also Read
- India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
టీ20 ప్రపంచకప్‌లో భారత్ వెనుదిరిగిన నేపథ్యంలో జట్టులోని సీనియర్ ఆటగాళ్లు కొంతమంది కెరీర్‌కు వీడ్కోలు పలికే ఆస్కారముందని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా రోహిత్ శర్మ తర్వాత హార్దిక్ పాండ్య జట్టు కెప్టెన్సీ చేపట్టే ఆస్కారం ఉందని కూడా చెప్పాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా తొలిసారే గుజరాత్ టైటాన్స్ జట్టును గెలిపించాడని, కావున భవిష్యత్‌లో టీమిండియా బాధ్యతలు అతడికి అప్పగించే అవకాశం ఉందన్నాడు. టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన తర్వాత కొందరు ఆటగాళ్లు రిటైర్మెంట్ తీసుకోవచ్చని, దీని గురించి వారు తప్పకుండా ఆలోచిస్తారని అన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, అశ్విన్, దినేశ్ కార్తీక్ లాంటి 30ల్లో ఉన్న సీనియర్ ఆటగాళ్లు ఈ కప్పులో నిరాశపర్చిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
ట్రెండింగ్
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!