టీమిండియా సీనియర్ బ్యాటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 2007 టీ20 ప్రపంచకప్‌లో ఆడుతున్నప్పుడు తాను స్కూల్‌లో ఉన్నానని దక్షిణాఫ్రికా సారథి తెంబా బావుమా గుర్తుచేసుకున్నాడు. ఇప్పటికీ హిట్‌మ్యాన్ రోహిత్ భారత జట్టులో ఉన్నాడని, అతడు ప్రపంచ స్థాయి ప్లేయర్ ప్రశంసించాడు. రోహిత్, విరాట్ కోహ్లీ రాకతో భారత జట్టు బలంగా మారిందని బావుమా చెప్పాడు. తొలి వన్డేకు దూరంగా ఉన్న బావుమా.. రెండో వన్డేలో ఆడనున్నాడు. రెండో వన్డే నేపథ్యంలో మంగళవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బావుమా మాట్లాడాడు.
‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రాకతో భారత జట్టు బలంగా మారింది. రో-కోల అనుభవం జట్టుకు ఉపదయోగపడుతుందని సిరీస్ ఆరంభంలోనే చెప్పా. ఆ విషయం మాకు తెలుసు. హిట్‌మ్యాన్ రోహిత్ 2007 టీ20 ప్రపంచకప్ ఆడుతున్నపుడు నేను స్కూల్ చదువుతున్నా. ఇప్పటికీ రోహిత్ భారత జట్టులో ఉన్నాడు. రో-కోలు వరల్డ్ క్లాస్ ప్లేయర్స్. వారితో చాలా మ్యాచ్‌లు ఆడాం. ఇద్దరి వల్ల మా జట్టు చాలాసార్లు ఇబ్బందులు ఎదుర్కొంది. కొన్నిసార్లు మేం విజయం సాధించాం. భారత జట్టులో రోహిత్, కోహ్లీ ఉండడం ఉత్సాహాన్ని పెంచుతుంది. అన్ని సిరీస్‌ను మరింత ఉత్తేజకరంగా మారుస్తాయి’ అని తెంబా బావుమా చెప్పాడు.
Also Read: IND vs SA: నేడు దక్షిణాఫ్రికాతో రెండో వన్డే.. భారత జట్టులో మార్పులు?, ఒక్క మ్యాచ్‌కే పక్కనపెడితే!
రాంచి వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ 17 పరుగుల తేడాతో గెలిచింది. విరాట్ కోహ్లీ (135) సెంచరీ చేయగా.. రోహిత్ శర్మ (57) హాఫ్ సెంచరీ బాదాడు. నేడు రెండు జట్ల మధ్య రాయ్‌పుర్‌లో రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ చూస్తోంది. రో-కోలు రాయ్‌పుర్‌లో చెలరేగాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. ఈ మైదానంలో భారత్ ఇప్పటివరకు ఒకే వన్డే మ్యాచ్ ఆడి ఘన విజయం సాధించింది.