Road Accident: ముంబైలోని ధారవి ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న 6 కార్లను వేగంగా వచ్చిన ట్యాంకర్ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనతో వాహనాలు కాలువలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారి గురించి ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం లభించలేదు. ప్రమాదం శుక్రవారం ఉదయం 6 గంటలకు జరిగింది. రాత్రి సమయంలో వాహనాలను రోడ్డు పక్కకు ఆపి వాటి యజమానులు ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే, తెల్లవారుజామున అదుపుతప్పి వేగంగా వచ్చిన ట్యాంకర్ ఆ వాహనాలను ఢీ కొట్టడంతో కాలువలో పడిపోయాయి. ఈ ఘటనలో వాహనాలన్నీ పూర్తిగా ధ్వంసం అయ్యాయి.
దాంతో ప్రమాదం జరిగిన కొద్దీ సేపటికే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. వారు ట్యాంకర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బందిని కూడా సంఘటనా స్థలానికి రప్పించి, సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం చాలా ఘోరంగా జరిగిందని అక్కడి ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగనందుకు అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కానీ ప్రమాదం జరిగిన స్థానంలో పెద్ద నష్టం చోటు చేసుకుంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు.