పొగమంచు కారణంగా తూర్పు చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లో ఆదివారం తెల్లవారుజామున 1 గంటలకు ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పలు వాహనాలు ఒకదానినొకటి ఢీకొట్టడంతో 17 మంది మృతి చెందగా, 22 మంది గాయపడినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.
ఢిల్లీలోని కాంజావాలాలో 20 ఏళ్ల యువతిని కారు 13 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన ఘటనను మరువక ముందే ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. దేశవ్యాప్తంగా ఢిల్లీ ఘటనపై చర్చ జరుగుతుండగానే యూపీలోని బాండాలో అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది.
రోడ్లపై గుంతలు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. గుంతలను తప్పించుకునే ప్రయత్నంలో చాలా మంది కిందపడి లేదా ఇతర వాహనాలను ఢీకొట్టి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మంగళవారం చెన్నైలో 22 ఏళ్ల ఓ సాఫ్ట్వేర్ యువతి రోడ్డుపై గుంతను తప్పించుకునే క్రమంలో ట్రక్కును ఢీకొట్టింది.
Rock fell on Auto: బండి రాయి రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. ఆటోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది ప్రాణాలు తీసింది.. మహబూబాబాద్ జిల్లాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది.. గ్రానైట్ లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ లోని బండ రాయి.. కూలీలు ప్రయాణిస్తున్న ఆటోపై పడిపోయింది… కురవి మండలం అయ్యగారిపల్లి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.. కూలీ పనులకు వెళ్లి.. ఆ పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న కూలీలు.. ఓ ఆటోలో ఎక్కారు.. అయితే,…
Gujarat Bus Crashes Into SUV After Driver Suffers Heart Attack, 9 Dead: గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టయోటా ఫార్చూనర్ కారును బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 9 మంది మరణించారు. 28 మంది గాయపడ్డారు. ప్రస్తుతం 11 మందిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. శనివారం తెల్లవారుజామున గుజరాత్ నవ్ సారి నుంచి వల్సాద్ వెళ్తున్న బస్సు, టయోటా ఫార్చునర్ ని ఢీకొట్టింది.…
భారత క్రికెటర్ రిషబ్ పంత్ శుక్రవారం ఉదయం ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలో ప్రమాదానికి గురై గాయాలపాలైన కొన్ని గంటల తర్వాత, నటి ఊర్వశి రౌతేలా తాను 'ప్రార్థిస్తున్నాను' అని పోస్ట్ చేసింది.
క్రికెటర్, టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రూర్కీ దగ్గర పంత్ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్‌కు తీవ్రగాయాలయ్యాయి.
ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ప్రహ్లాద్ మోదీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి.