Shocking Accident : రోడ్లపై వెళ్తున్న ప్రయాణికుల పాలిట కేబుల్స్ ఉరితాళ్లుగా మారుతున్నాయి. తెగిపడిన టెలిఫోన్, ఇంటర్నెట్, టీవీ కేబుల్ వైర్లు రోడ్లపై వేలాడుతుండడంతో ఆ దిశలో పోయే ప్రయాణికుల మెడకు చుట్టకుని ప్రాణాల పైకి తెస్తున్నాయి. ఇలాంటి ఘటనలు చాలా చోట్ల జరుగుతున్న సదరు సంస్థలు పట్టించుకున్న పాపాన పోవడంలేదు. కరెంట్ సప్లయ్ తక్కువగా ఉండే కేబుల్స్ కాబట్టి ఎలాగో వాహనదారులు ప్రాణాపాయం నుంచి బయటపడుతున్నారు. అదే కరంట్ వైర్లు పడితే ప్రమాదస్థాయి ఎక్కువగా ఉంటుంది. కావున రోడ్లపై వేసే వైర్లపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ ఉండాలని వాహనదారులు కోరుతున్నారు.
Read Also: Indigo Flight : రోడ్లపై అయిపోయాయి.. ఇక విమానాల్లో మొదలయ్యాయి
కొచ్చిలో రోడ్డుపై వెళ్తున్న మహిళ మెడకు కేబుల్ చిక్కుకోవడంతో ఆమె ఆస్పత్రి పాలైంది. కలమసెరి తేవకల్-మనాలిముక్ రహదారిపై పొన్నకుడం దేవాలయం సమీపంలో ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన శ్రీని అనే మహిళను అప్పక్కూడా ఆస్పత్రిలో చేర్పించారు. ఆదివారం కావడంతో ఆమె తన కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఆమె ముఖం, మెడకు కేబుల్ తగిలింది. కేబుల్ తెగి వీధిలైట్ పగిలి కింద పడింది. బైక్ బోల్తా పడకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని శ్రీని చెబుతున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేస్తానని ఆమె చెప్పారు.
Read Also:Israel Protest : అట్టుడుకుతున్న ఇజ్రాయెల్.. రోడ్లను దిగ్బంధించిన నిరసనకారులు
గత నెలలో ఎర్నాకుళం లాయం రోడ్డులో కేబుల్ మెడలో చిక్కుకుని ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఎర్నాకులం సౌత్ సాబు మెడకు కేబుల్ చిక్కుకుంది. రోడ్డుపై పడిన సాబు దంపతులు సురక్షితంగా బయటపడ్డారు. ఘటన అనంతరం కేబుల్ సమస్యపై హైకోర్టు జోక్యం చేసుకుని కేబుల్స్ తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ సమయంలో స్థానిక సంస్థలు రంగంలోకి దిగి చర్యలు చేపట్టినా పూర్తి కాలేదు.