తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. ఇవాళ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఆమె.. ఈ సందర్భంగా కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. యాదాద్రి ఆలయాన్ని కేసీఆర్ అద్భుతంగా నిర్మాణం చేయిస్తున్నారని కొనియాడిన ఆమె.. ఈ కాలంలో ఎవరికీ దక్కని గొప్ప అవకాశం కేసీఆర్‌కు మాత్రమే దక్కిందన్నారు.. గతంతో పోలుస్తే చక్కగా ఇప్పుడు ఆలయాన్ని డిజైన్ చేసి పునః నిర్మాణం చేశారని.. ఈ కాలంలో ఏవరికి ఇలాంటి…
ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు చిచ్చు పెడుతున్నాయి.. తాజాగా, జరిగిన పరిణామాలపై ఆవేదనకు గురైన ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే ఆర్కే రోజా.. అవసరం అయితే రాజీనామాకైనా సిద్ధమంటున్నారు.. ఇంతకీ ఆమె అసంతృప్తి కారణం ఏంటంటే.. శ్రీశైలం బోర్డు చైర్మన్ నియామకమే. తాజాగా, శ్రీశైలం బోర్డు చైర్మన్‌గా చెంగారెడ్డి చక్రపాణిరెడ్డిని నియమించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అయితే, ఈ వ్యవహారం రోజాకు మింగుడుపడడం లేదు.. చక్రపాణిరెడ్డికి పదవి ఇవ్వడంపై రోజా కినుకు వహించారు.. కాగా,…
ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ కొంత ప్రచారం జరుగుతోంది.. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నకల మూడ్‌లోకి వెళ్లిపోయినట్టు సభలు, సమావేశాలు, రాజకీయా నేతల పర్యటనలతో హీట్ పెంచుతున్నారు.. కోవిడ్ మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కాస్త వెనక్కి తగ్గినా.. స్టేట్‌మెంట్లు, ఆరోపణలు, విమర్శలతో మాత్రం హీట్ పెంచుతూనే ఉన్నారు.. అయితే, ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. ఇవాళ తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ముందస్తూ…
చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య హైఓల్టేజ్ వార్ నడుస్తూనే ఉంది.. ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే పలు సందర్భాల్లో గ్రూప్ వారు రోడ్డెక్కి రచ్చగా మారిన సందర్భాలు లేకపోలేదు.. తాజాగా మరోసారి అదే జరిగింది.. ఇప్పుడు పార్టీ సుప్రీం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పుట్టినరోజు నేపథ్యంలో.. మరోసారి గ్రూప్ వార్ బయటపడింది.. ఎమ్మెల్యే ఆర్కే రోజా వర్సెస్ ఆమె వ్యతిరేక వర్గంగా మారింది పరిస్థితి… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పుట్టిన…
ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది.. టీడీపీ డీలాపడిపోగా.. వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి… ఈ ఫలితాలపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. ఏ ఎన్నికలు వచ్చినా వార్ వన్‌సైడే అన్నారు.. ఈ ఎన్నికల్లో నలబై ఏళ్ల ఇండ్రస్టీ అయినా చంద్రబాబుని తరిమి కొట్టారని సెటైర్లు వేసిన ఆమె.. కుప్పంలోనే ఇల్లు లేని చంద్రబాబును… హైదరాబాదు ఇంటికి పరిమితం చేశారని వ్యాఖ్యానించారు… ఇకనైనా చంద్రబాబు, లోకేష్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని…
సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ రోజా తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు. తెరపై అందాలతారగా జనానికి శ్రీగంధాలు పూసిన రోజా, కొన్ని అరుదైన పాత్రల్లోనూ అభినయంతో అలరించారు. మాతృభాష తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మళయాళంలోనూ తనదైన బాణీ పలికించారు రోజా. రెండు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు రోజా. ఇక బుల్లితెరపై ఆమె నిర్వహిస్తున్న కార్యక్రమాలు సైతం ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతున్నాయని చెప్పవచ్చు. రోజా అసలు పేరు శ్రీలతా రెడ్డి. 1972 నవంబర్ 17న తిరుపతిలో జన్మించారు. పద్మావతి…
నిత్యం రాజకీయాలతో బిజీగా వుండే నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజా ఆటవిడుపుతో అలరించారు. తన నియోజకవర్గమయిన నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రామీణ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. తనకెంతో ఇష్టమయిన కబడ్డీ ఆడి అలరించారు ఎమ్మెల్యే ఆర్కే రోజా సెల్వమణి. గతంలోనూ అనేక సార్లు రోజా కబడ్డీ ఆడారు. గ్రామీణ క్రీడల పునరుత్తేజానికి అంతా పాటు పడాలన్నారు. ఖాళీ వున్నప్పుడల్లా కబడ్డీ ఆడాలన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ఫైర్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. 14 ఏళ్ల ముఖ్యమంత్రివా లేక వీధి రౌడివా? అంటూ కామెంట్ చేసిన ఆమె.. “యథా రాజా తథా ప్రజా” అంటారు.. అయితే ఇప్పుడు అది తెలుగు దేశం పార్టీకి, చంద్రబాబుకే సరి పోతుందని ఎద్దేవా చేశారు.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, అతనిని నమ్మి ఓటేసిన కుప్పం నియోజకవర్గ ప్రజలకి హంద్రీ – నీవా ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు కూడా ఇవ్వకుండా…
చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి… ఎంపీటీసీ ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా చాటగా.. ఎంపీపీ ఎన్నికల విషయంలో.. స్థానిక ఎమ్మెల్యే రోజాకు సెగ తగిలింది.. నిండ్ర మండలం.. ఎంపీపీ ఎన్నికల్లో ఎమ్మెల్యే రోజా నిర్ణయించిన అభ్యర్థికి స్థానిక నేతలు చక్రపాణిరెడ్డితో పాటు అతడి తమ్ముడు కూడా మద్దతు ఇవ్వలేదు.. దీంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఎమ్మెల్యే రోజా.. స్థానిక ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఇలా చేయడం సరికాదన్నారు.…
ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా వేడిక్కించాయి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు.. సీఎం వైఎస్ జగన్, వైసీపీ సర్కార్, కొందరు మంత్రులను, డీజీపీని టార్గెట్ చేస్తూ అయ్యన్న చేసిన వ్యాఖ్యలపై అధికారపార్టీ మండిపడుతోంది.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసాన్ని ముట్టడించేందుకు కూడా ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు యత్నించాయి.. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఇక, అయ్యన్న వ్యాఖ్యలపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. ఘాటుగా కౌంటర్ ఇచ్చారు..…