ప్రపంచరికార్డు సృష్టించేలా విశాఖలో అంతర్జాతీయ యోగా డే వేడుకల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాళ్టి నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ నిర్వహిస్తుండగా.. విశాఖలోని ఆర్కే బీచ్ లో వందల మందితో ప్రాథమిక వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ విప్ గణ బాబు, కలెక్టర్, సిటీ పోలీసు కమిషనర్ పాల్గొన్నారు. జూన్ 21 విశాఖలో జరిగే యోగా డే వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.. వేలాది మందితో కలిసి ఆయన యోగాసనాలు వేయనున్నారు..
విశాఖలోని ఆర్కే బీచ్‌లో ఓ ఇసుక లారీ భీభత్సం సృష్టించింది. మంగళవారం ఉదయం 6:30 గంటల సమయంలో నోవాటల్ పక్కన ఎత్తుగా ఉన్న రోడ్డు నుండి బీచ్ రోడ్డులోకి ఇసుక లోడ్ తో వస్తున్న లారీ బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి. దీంతో ఎదురుగా ఉన్న డివైడర్‌ను ఢీకొని చిల్డ్రన్ పార్కులోకి లారీ దూసుకు పోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్‌తో పాటు బీచ్ రోడ్డులో వాకింగ్ చేస్తున్న మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన…
విశాఖ ఆర్కే బీచ్లో పర్యాటకులకు పెను ప్రమాదం తప్పింది. నిన్న ఆర్కే బీచ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జి ప్రారంభించారు. అయితే.. అది తెగిపోయింది. కాగా.. ఫ్లోటింగ్ బ్రిడ్జి చివరి ఫ్లాట్ ఫామ్ భాగం సముద్రంలోకి 100 మీటర్లు దూరం కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మరోవైపు.. పర్యాటకులు ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోవడంతో ఎక్కాలంటే భయబ్రాంతులకు గురవుతున్నారు. అయితే.. ఫ్లోటింగ్ బ్రిడ్జిని నిన్న ఆర్కే బీచ్లో అట్టహాసంగా రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మంత్రి…
సమ్మర్ హాలీడేస్ వచ్చాయంటే.. కొందరు పల్లెటూర్లకు వెళ్తుంటారు.. ఇంకొందరు టూర్లు ప్లాన్ చేసుకొని హాయిగా ప్రయాణాలు చేస్తున్నారు. వీలైతే ఈ సమ్మర్‌లో ఈ బీచ్‌లకు వెళ్లండి. విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్ట్, వీసాలు కావాలి. కాబట్టి బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుంది. భారతదేశంలో ఉన్న బీచ్‌లు చూస్తే చాలు ప్రపంచంలో ఉన్న వెరైటీ బీచ్‌లన్నింటినీ చుట్టేసినట్టే.
విశాఖలోని ఆర్కే బీచ్‌లో ఓ వివాహిత శవమై కనిపించిన ఘటన కలకలం రేపింది. బీచ్ ఒడ్డున మృతదేహం పడి ఉన్న తీరు ఆమెదీ హత్య, లేక ఆత్మహత్యనా అన్న అనుమానాలు రేకెత్తించాయి. ఇసుకలో సగం మృతదేహం కూరుకుపోయి.. మిగతా సగం అర్థ నగ్నంగా కనిపించింది. మంగళవారం అత్తారింట్లో నుండి వెళ్లిపోయిన వివాహిత, ఎంతకూ ఇంటికి తిరిగి రాకపోవడంతో కంగారుపడ్డ అత్తామామలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు.
Punishment For Drunk and Driving: మద్యం తాగి వాహనాలు నడపొద్దు.. ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దు మొర్రో అని పోలీసులు చెబుతున్నా.. పట్టుకుని ఫైన్లు విధిస్తున్నా.. అరెస్ట్ చేస్తున్నా.. బైక్‌లు, కార్లు సీజ్ చేస్తున్నా.. కోర్టు శిక్షలు విధిస్తున్నా.. మందు బాబులు మారడం లేదు.. లిక్కర్ తాగుతూనే ఉన్నారు.. పోలీసులకు చిక్కుతూనే ఉన్నారు.. తాజాగా, విశాఖ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు మందు బాబులకు విధించిన శిక్ష ఆస్తికరంగా మారింది.. గత మూడు రోజుల్లో డంకెన్ డ్రైవ్ లో 52…
Pawan Kalyan in Vizag RK Beach: జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నం పర్యటనలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యేందుకు శుక్రవారం పవన్ కల్యాణ్ నగరానికి చేరుకున్న సంగతి తెలిసిందే.