సమ్మర్ హాలీడేస్ వచ్చాయంటే.. కొందరు పల్లెటూర్లకు వెళ్తుంటారు.. ఇంకొందరు టూర్లు ప్లాన్ చేసుకొని హాయిగా ప్రయాణాలు చేస్తున్నారు. వీలైతే ఈ సమ్మర్‌లో ఈ బీచ్‌లకు వెళ్లండి. విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్ట్, వీసాలు కావాలి. కాబట్టి బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుంది. భారతదేశంలో ఉన్న బీచ్‌లు చూస్తే చాలు ప్రపంచంలో ఉన్న వెరైటీ బీచ్‌లన్నింటినీ చుట్టేసినట్టే. ఈ సమ్మర్ మీకు మెమరబుల్‌గా మిగలాలంటే మీరు తప్పుకుండా ఈ బీచ్‌లను కచ్చితంగా చూడాల్సిందే.
Also Read : Sharad Pawar: ప్లాన్ ప్రకారమే శరద్ పవార్ రాజీనామా.. శివసేన పత్రిక సామ్నాలో కీలక వ్యాఖ్యలు..
కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబర్ దీవుల్లో ఈ బీచ్‌ని నిశ్శబ్దానికి పర్యాయపదంగా చెబుతుంటారు. స్క్యూబా డైవింగ్, ట్రెక్కింగ్, వాటర్‌గేమ్స్, వంటి ఎన్నో సాహస క్రీడలను ఇక్కడ ఉంటాయి. వారం రోజుల పాటు తిరిగినా పూర్తవ్వని చూడదగ్గ ప్రదేశాలున్నాయి. సముద్రపు ఏనుగుల మీద స్వారీ అయితే అసలు చెప్పనక్కర్లేదు.
Also Read : Solar Maximum: “సోలార్ మాగ్జిమమ్”.. సూర్యుడిపై భారీ విస్పోటనాలు.. భూమికి ప్రమాదమా..?
కేరళ రాష్ట్రంలో ఉన్న ప్రతీ బీచ్ అందమైనదే. అలప్పిలో ఉన్న మరారి బీచ్ పట్టణానికి నాలుగు వైపులా విస్తరించి ఉంది. నగరానికి దగ్గరగా ఉండడం వల్ల ఈ బీచ్ కి విదేశీయుల తాకిడి ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి ఈ బీచ్‌కి వెళ్తే మిమ్మల్ని మీరు మైమరిచి పోతారు.. ఈ ప్రపంచం నుంచి మరో ప్రపంచానికి వెళ్తారు. ఖరీదైన రిసార్టులు ఇక్కడ ఉంటాయి. అవి స్వర్గాన్ని తలపిస్తాయి.
Also Read : హాట్ పోజులతో హీట్ పుట్టిస్తున్న రుహాని శర్మ
మానసిక ప్రశాంతత కోసం ఈ మధ్య కాలంలో చాలామంది గోవా ప్రాంతం వెళ్తున్నారు. గోవాలో ఒక్కటా రెండా వందల సంఖ్యలో బీచ్‌లున్నాయి. అక్కడి భిన్న వాతావరణం సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. గేమ్స్, డీజే నైట్స్ మరో కొత్త లోకాల్లోకి తీసుకెళ్తాయి.
Also Read : Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
విశాఖలోని ఆర్కే బీచ్ గురించి తెలుగు ప్రజలకు చెప్పనక్కర్లేదు. మనకు దగ్గరలో ఉన్న అతిపెద్ద బీచ్ ఇదే. ఈ బీచ్ చుట్టూ మ్యూజియంలు, గార్డెన్స్, గేమింగ్ జోన్‌లు ఇలా ఎన్నో సదుపాయాలున్నాయి. విశాఖ నగరానికి వెళ్తే ఆర్కే బీచ్‌తో పాటు కైలాసగిరి, అరకు, బొర్రాగుహలు ఇలా చాలా పర్యాటక ప్రాంతాలను మనం చుట్టేసి రావొచ్చు.
Also Read : Botsa Satyanarayana: సీఎం జగన్‌కు మంత్రి బొత్స కృతజ్ఞతలు.. అందుకే చంద్రబాబుకు కడుపు మంట..!
మన దేశంలో ఉన్న అత్యంత పరిశుభ్రమైన బీచ్‌లలో ఇది ఒకటి. నిత్యం వందలాది పర్యాటకులు, రకరకాల వంటకాలు, కలర్‌ఫుల్ కార్యక్రమాలతో ఈ బీచ్ అందంగా ఉంటుంది. సాయంత్రం అలల మీద సర్ఫింగ్ చేస్తుంటే చూడాలి.. మీకు అక్కడినుంచి రావాలనిపించదు. ఇవన్నీ ఇలా ఉంటే.. పాండవుల రథాల వంటి ఏడవ శతాబ్దానికి చెందిన ఎన్నో చారిత్రక ఆధారాలు మనం చూడవచ్చు.
గోపాల్‌పూర్ బీచ్.. ఇది ఒరిస్సా రాజధాని భువనేశ్వర్‌కు 190 కిలోమీటర్ల దూరంలో ఉంది. గిరిజనులుండే ఈ ప్రాంతమంతా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ హిందూ దేవాలయాలు, పురాతన కట్టడాలున్న ఈ ఏరియా పర్యాటకంగా బాగా డెవలప్మెంట్ చెందింది. ముఖ్యంగా ఇక్కడ పోర్టులోని లైట్‌హౌజ్ అన్నింటికంటే ప్రత్యేకమైంది.