Jetleey Movie Glimpse: రితేష్ రాణా దర్శకత్వంలో ప్రముఖ హాస్యనటుడు సత్య హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘జెట్లీ’. తాజాగా విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్‌లో విమాన ప్రయాణానికి సంబంధించిన నవ్వులు పూయించే ఒక హాస్యభరితమైన సన్నివేశాన్ని చూపించారు. విమానంలో ప్రయాణికులు టర్బులెన్స్ (కుదుపులు) ఎదుర్కొంటున్న…