బ్రిటన్ ప్రధాని పదవి రేసులో భారత సంతతికి చెందిన కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు రిషి సునాక్ పేరు బలంగా వినిపిస్తోంది. రిషికి 100 మందికి పైగా పార్టీ అభ్యర్థుల మద్ధతు లభించినట్లు ఆయన అనుచరులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ప్రధాని పదవికి తాను పోటీ పడుతున్నట్లు బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ ట్విటర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు.