సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవం చవిచూసిన భారత్.. ఇప్పుడు కీలక సమరానికి సిద్ధమవుతోంది. నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. గత రెండు సిరీస్‌లు గెలుచుకున్న టీమిండియా.. హ్యాట్రిక్‌పై కన్నేసింది. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియాపై భారత్ ఐదు మ్యాచ్‌ల్లో కనీసం నాలుగింటిలోనైనా గెలవాలి. కీలక సిరీస్ కాబట్టి భారత ఆటగాళ్లు ముందుగానే కంగారో గడ్డపై అడుగుపెడుతున్నారు. ఇప్పటికే బ్యాటర్లు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్‌లు ఆస్ట్రేలియా చేరుకున్నారు.…