స్టీలు ప్లాంటు మీద ప్రధాని మోడీ కన్ను పడిందని మాజీ ఎమ్మె్ల్యే జగ్గారెడ్డి తెలిపారు. స్టీలు ప్లాంటును ఎవరికో కట్టబెట్టాలనే దురుద్దేశంతో ప్రయత్నాలు మొదలయ్యాయి.. ఏపీ కాంగ్రెస్ లో రాజకీయంగా ప్రతినిధులు లేకుండా పోయారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో గందరగోళం నెలకొన్నట్టుగా తెలుస్తోంది.. ఓవైపు సెయిల్‌లో స్టీల్ ప్లాంట్ విలీనం అంటూ లీకులు వచ్చిన కొద్ది సేపటికే.. పిడుగులాంటి నిర్ణయం తీసుకుంది యాజమాన్యం.. ప్రైవేటీకరణ లేదని ప్రకటిస్తూనే ఉద్యోగులపై వేటు వేసింది.. తాజా నిర్ణయంతో స్టీల్ ప్లాంట్‌లో పనిచేసే నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఔట్ కానున్నారు.
స్టీల్ ప్లాంట్ సంక్షోభం రాజకీయ వేడిని రాజేస్తోంది. విశాఖ ఉక్కు మూసివేయడమే అంతిమ నిర్ణయం అయితే తన పదవికి రాజీనామా చేస్తానని గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రకటించారు.