అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ భార్య కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం కేసు పెట్టనున్నారు. బిస్వా శర్మ భార్య రింకీ భుయాన్ శర్మతో సంబంధం ఉన్న కంపెనీకి కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో డబ్బులు అందాయని లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్ పేర్కొన్నారు.