‘మా ఇష్టం’ సినిమా నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నిర్మాత నట్టి కుమార్ మధ్య తలెత్తిన వివాదం సద్దుమణిగింది. నిన్నటిదాకా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ, కేసులు పెట్టుకున్న ఆ ఇద్దరి మధ్య ఇప్పుడు సయోధ్య కుదిరింది. తమ మధ్య ఏర్పడ్డ అపార్ధాలు పూర్తిగా తొలగిపోయాయని తెలిపిన ఆ ఇద్దరు.. పరస్పరం నమోదు చేసుకున్న కేసుల్ని సైతం వెనక్కు తీసుకున్నట్టు సంయుక్తంగా ప్రకటించారు. అసలేం జరిగిందంటే.. ‘మా ఇష్టం’ సినిమా సమయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో…
దర్శకుడు రాంగోపాల్ వర్మపై నిర్మాత నట్టి కుమార్ మండిపడ్డారు. ఆయన సినిమాలేవీ రిలీజ్ కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. తన సంతకం ఫోర్జరీ చేశారంటూ నట్టి క్రాంతి, కరుణలపై వర్మ కేసు పెట్టిన నేపథ్యంలో.. నట్టికుమార్ తీవ్రంగా స్పందించారు. తమ వద్ద నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమంటే.. ఆర్జీవీ తన పిల్లలపై తప్పుడు కేసులు పెట్టాడని ఫైరయ్యారు. తమ దగ్గర నుంచి వర్మ డబ్బులు బాగా తీసుకున్నాడని, వాటిని తిరిగి ఇవ్వమని అడిగితే మాత్రం ఫేక్ అంటూ…
ఎప్పుడూ వివాదాలతో వార్తల్లోకెక్కే దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఈసారి ఓ పోలీస్ కేసుతో తెరమీదకొచ్చారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ ఆయన నట్టి క్రాంతి, కరుణ అనే వ్యక్తులపై పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ నిరంజన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు అందించిన వర్మ.. ‘మా ఇష్టం’ సినిమా సమయంలో తన సంతకాన్ని వాళ్ళు ఫోర్జరీ చేసినట్టు అందులో పేర్కొన్నారు. 2020 నవంబర్ 30వ తేదీన తన లెటర్ హెడ్ తీసుకొని, నకిలీ పత్రాల్ని సృష్టించి, ఫోర్జరీ…