ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద ఇష్టారీతిన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. అప్పట్లో వాటన్నిటిని భరించిన టీడీపీ శ్రేణులు.... కూటమి అధికారంలోకి వచ్చాక ఓపెనైపోతున్నాయి. వర్మ మా నేతల మీది పిచ్చిపిచ్చి పోస్టుల పెట్టి మనోభావాలు దెబ్బతీశారంటూ రాష్టం నలు మూలల కేసులు పెడుతున్నారు.
ఏపీలో తనపై కేసుల నమోదుపై ఆర్జీవీ వరుస ట్వీట్లు.. 22 పాయింట్లు లేవనెత్తిన వర్మ.. నా కేసు-RGV అంటూ ట్విట్టర్ (ఎక్స్)లో పోస్టు పెట్టిన ఆయన.. జాతీయ మీడియాతో పాటు తెలుగు మీడియాను ట్యాగ్ చేస్తూ.. 22 పాయింట్లు లేవనెత్తారు..