Parigi : వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ అధికారుల చర్యలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల క్రితం తుంకులగడ్డ ప్రాంతంలో ప్రభుత్వంచే కేటాయించిన ఇళ్ల స్థలంలో లబ్ధిదారుడు ఇల్లు నిర్మించేందుకు బునాది గోడలు నిర్మిస్తుండగా, పరిగి తహసీల్దారు జేసీబీతో వచ్చి వాటిని ధ్వంసం చేశారు. అంతేకాదు, ఈ ఘటనను వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తి సెల్‌ఫోన్‌ను లాక్కొనడం చర్చనీయాంశమైంది. ఈ విషయమై స్థానికులు అధికారుల తీరును తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. 2002లో సర్వే నంబర్ 530లో…
Tension in Mahbubabad: మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నూతన కలెక్టరేట్ కార్యాలయ సమీపంలో నివసిస్తున్న పేదల ఇండ్లను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఇవాళ ఉదయం తొలగించారు.
తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తిరుపతి బందరి కాలనీ, రాయల్ నగర్ వద్ద ఇళ్ళు కూల్చివేత టెన్షన్ వాతావరణం సృష్టించింది. 40 ఏళ్ళుగా తామిక్కడ నివాసం వుంటున్నామని, తమ అధీనంలో ఉన్న ఇళ్ళను ఇక్కడ ప్రజా ప్రతినిధులు కబ్జా చేస్తున్నారని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఖరీదైన స్థలం కావడంతో కబ్జా దారుల కన్ను పడిందని మహిళలు ఆరోపిస్తున్నారు. తిరుపతి రెవెన్యూ అధికారులు, పోలిసుల సమక్షంలో కబ్జాలు చేస్తున్నారని మహిళలు అడ్డుకున్నారు. తమ ఆధీనంలో ఇళ్ళకు అన్ని…
ఏపీ దేవాదాయ శాఖలో డిప్యుటేషన్ పేరుతో రెవెన్యూ అధికారుల పెత్తనానికి బ్రేకులు పడనున్నాయ్. ప్రధాన ఆలయాలకు ఈవోలుగా డిప్యూటీ కలెక్టర్లను నియమించే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలకనుంది. నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన నియమకాలపై సుదీర్ఘంగా న్యాయ వివాదం జరగ్గా చివరకు దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఊరట లభించింది. రాష్ట్రంలో 8 ప్రధాన ఆలయాలు దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నాయి. వీటిలో సింహాచలం, కాణిపాకం, ద్వారకా తిరుమల, శ్రీశైలం, శ్రీకాళహస్తి ముఖ్యమైనవి. ఈ ఆలయాలకు వచ్చే భక్తుల…
విశాఖ జిల్లా పెందుర్తి మండలం సత్తివానిపాలెంలో రెవెన్యూ అధికారులపై వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. రేవళ్ల చెరువులో 10 ఎకరాల భూబి ఆక్రమణకు గురైన విషయం అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో పెందుర్తి ఆర్ఐ శివ కుమార్, గ్రామ సచివాలయ కార్యదర్శి వెంకటేష్ ఆక్రమణకు గురైన భూమిని పరిశీలించారు. వెంటనే జేసీబీలతో వెళ్లి ఆక్రమణలను తొలిగించే ప్రయత్నం చేశారు. దీనిపై ఆగ్రహించిన వైసీపీ నేతలు పెందుర్తి ఆర్ఐ శివ కుమార్, గ్రామ సచివాలయ కార్యదర్శి వెంకటేష్‌పై దాడికి…