Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pachimirchi Avakaya: ఆవకాయ అంటే చాలామందికి మామిడి ఆవకాయే గుర్తుకు వస్తుంది. కానీ పచ్చిమిర్చితో చేసే ఆవకాయ కూడా అద్భుతమైన రుచిని ఇస్తుంది. బజ్జీ మిరపకాయలతో చేసే ఈ పచ్చిమిర్చి ఆవకాయ కారం ఎక్కువగా ఉంటుందనుకుంటే పొరపాటే. సరైన విధంగా చేస్తే మిరపకాయలు అస్సలు కారం లేకుండా కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి. వేడి వేడి అన్నంలో ఒక మిరపకాయ, కొంచెం ఆవకాయ గుజ్జు వేసుకుని తింటే నెయ్యి కూడా అవసరం ఉండదు. ముఖ్యంగా ఈ పచ్చడిని సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా చెసాలో చూసేద్దామా..
కావలసిన పదార్థాలు:
* బజ్జీ మిరపకాయలు – పావు కిలో
* నిమ్మకాయలు – 3
* మెంతులు – 1 టేబుల్ స్పూన్
* ఆవాలు – 2 టేబుల్ స్పూన్లు
* కారం – అర కప్పు
* ఉప్పు – పావు కప్పు (తగ్గించి లేదా పెంచుకోవచ్చు)
* వెల్లుల్లి రెబ్బలు – 30 నుంచి 40
* పల్లీ నూనె – 1 కప్పు
Also Read
- IND vs PAK U19 Asia Cup Final: భారత్ ముందు భారీ టార్గెట్.. పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్!!
- Vastu Tips: ఇంట్లో పొరపాటున కూడా ఈ 3 మొక్కలను పెంచకండి.. దరిద్రం వెంటాడుతుంది!!
- Kadapa Controversy: రాజకీయ నేత కోసం వెంకన్న పోస్టరా? కడపలో వైరల్‌గా మారిన ఫొటో!
- Shreyas Iyer: అత్యంత చెత్త రికార్డు..! కోహ్లీ, గిల్ సరసన శ్రేయస్ అయ్యర్!
తయారీ విధానం:
మిరపకాయలను సిద్ధం చేసుకోవడం:
ముందుగా ఫ్రెష్‌గా గట్టిగా ఉన్న బజ్జీ మిరపకాయలను ఎంపిక చేసుకోవాలి. పగుళ్లు ఉన్న కాయలను తీసుకోకూడదు. వాటిని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి అరగంట పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. తర్వాత ప్రతి మిరపకాయను మధ్యలో కోసి గింజలను నిదానంగా తీసేయాలి. ఇలా చేయడం వల్ల పచ్చడి కారం తగ్గి తినడానికి చాలా బాగుంటుంది.
నిమ్మరసం కలపడం:
గింజలు తీసిన మిరపకాయలపై నిమ్మరసం వేసి బాగా కలిపి 15 నిమిషాలు నాననివ్వాలి. నిమ్మరసం కలపడం వల్ల మిరపకాయలలో ఉన్న కారం తగ్గుతుంది. అలాగే ఇది సహజమైన ప్రిజర్వేటివ్‌లా పనిచేసి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు సహాయపడుతుంది.
ఆవాల పొడి తయారీ:
స్టవ్‌పై పాన్ పెట్టి ముందుగా మెంతులను సన్నని మంటలో ఎర్రగా వేయించాలి. తర్వాత అందులో ఆవాలు వేసి ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడే పచ్చడికి అసలైన రుచిని ఇస్తుంది.
పచ్చడి కలిపే విధానం:
ఒక పెద్ద బౌల్లో కారం, ఉప్పు, ఆవాల-మెంతుల పొడి, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత బుడ్డల (పల్లీ) నూనె పోసి బాగా కలపాలి. ఈ పచ్చడికి పచ్చి పల్లీ నూనె వాడితేనే మంచి రుచి వస్తుంది. ఇప్పుడు నిమ్మరసంలో నానబెట్టిన మిరపకాయలను ఇందులో వేసి చేత్తోనే నిదానంగా కలపాలి. ప్రతి మిరపకాయకు కారం మిశ్రమం బాగా పట్టేలా చూసుకోవాలి.
పచ్చడి ఊరడం:
పచ్చడిని కలిపిన తర్వాత మూతపెట్టి ఒక రోజు పాటు ఊరనివ్వాలి. మరుసటి రోజు నూనె పైకి తేలుతుంది. అప్పుడు మరోసారి నిదానంగా కలిపి ఉప్పు లేదా పులుపు తక్కువగా ఉంటే అవసరానికి తగ్గట్టు కలుపుకోవచ్చు. మళ్లీ ఇంకో రోజు ఊరనిచ్చి గ్లాస్ జాడీల్లో నిల్వ చేసుకోవాలి. పచ్చడిపై నూనె పొర కనిపించేలా ఉండాలి. పచ్చడి తీసే స్పూన్ తడి లేకుండా చూసుకుంటే బయటే రెండు నుంచి మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిజ్‌లో ఉంచితే ఆరు నెలలకుపైగా తాజాగా ఉంటుంది. అంతే ‘పచ్చిమిర్చి ఆవకాయ’ రెడీ.
తాజావార్తలు
-
Panasonic ToughBook FZ-G3: Panasonic కొత్త రగ్డ్ టాబ్లెట్ ToughBook FZ-G3 లాంచ్.. 16GB RAM, 512GB SSD
-
IND vs PAK U19 Asia Cup Final: భారత్ ముందు భారీ టార్గెట్.. పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్!!
-
Vastu Tips: ఇంట్లో పొరపాటున కూడా ఈ 3 మొక్కలను పెంచకండి.. దరిద్రం వెంటాడుతుంది!!
-
Kadapa Controversy: రాజకీయ నేత కోసం వెంకన్న పోస్టరా? కడపలో వైరల్‌గా మారిన ఫొటో!
-
Rowdy Janardhana: విజయ్, సూర్య కాదు.. ‘రౌడీ జనార్ధన’లో మలయాళ స్టార్!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!