Vaibhav Sooryavanshi: ‘ఒక్కే ఒక్క కండీషన్..’ వైభవ్‌పై క్రికెట్ గాడ్ సచిన్ సంచలన కామెంట్స్.. ఏం అన్నాడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi : క్రికెట్ ప్రపంచంలో ప్రతిభకు వయసు అడ్డుకాదని మరోసారి నిరూపిస్తున్న పేరు వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ 2026 సీజన్‌ను తనదైన దూకుడుతో కుదిపేసిన ఈ యువ సంచలనం ఇప్పుడు భారత క్రికెట్ భవిష్యత్తుగా చర్చల్లో నిలిచాడు. అతడు టెస్ట్ క్రికెట్ ఆడేందుకు సిద్ధమా అనే ప్రశ్నపై ఇప్పటికే అనేక మంది మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండగా, ఇప్పుడు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన అసాధారణంగా నిలిచింది. మొత్తం 776 పరుగులు చేసిన అతడు 237.31 స్ట్రైక్ రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. ఈ క్రమంలో 72 సిక్సర్లు బాదుతూ ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతడి దూకుడైన బ్యాటింగ్ శైలి అభిమానులను మాత్రమే కాదు, క్రికెట్ నిపుణులను కూడా ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా బంతిని ముందుగానే అంచనా వేసి, మైదానంలోని అన్ని వైపులా షాట్లు ఆడగల సామర్థ్యం అతడిని ప్రత్యేక ఆటగాడిగా నిలబెడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఈ నేపథ్యంలో ESPNcricinfoతో మాట్లాడిన సచిన్ టెండూల్కర్, వైభవ్‌ను నిజంగా ప్రత్యేకమైన ప్రతిభగా అభివర్ణించాడు. అతడు కేవలం బలంగా కొట్టే బ్యాటర్ కాదని, అతని మణికట్టు వినియోగం ఎంతో ఆకట్టుకుందని సచిన్ పేర్కొన్నాడు. మైదానంలోని అన్ని దిశల్లో షాట్లు ఆడాలంటే అద్భుతమైన రిస్ట్ వర్క్ అవసరమని, వైభవ్ వద్ద ఆ నైపుణ్యం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పాడు. అతడు గుడ్డిగా బాదడం లేదని, బంతి లైన్, లెంగ్త్‌ను ఇతరుల కంటే ముందే గుర్తించి సులభంగా బౌండరీలు, సిక్సర్లు సాధిస్తున్నాడని వివరించాడు.
వైభవ్ అద్భుత ప్రదర్శనల నేపథ్యంలో అతడిని త్వరగా భారత జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్ కుమార్ సంగక్కర కూడా అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధంగా ఉన్నాడని అభిప్రాయపడ్డాడు. అయితే సచిన్ ఈ విషయంలో కొంత జాగ్రత్త అవసరమని సూచించాడు. టెస్ట్ క్రికెట్లో అవకాశం వచ్చినప్పుడు అతడిని తన సహజ ఆటను మార్చమని ఒత్తిడి చేయకూడదని స్పష్టం చేశాడు.
ప్రతి బంతి ఒక ప్రశ్నలా ఉంటుందని, దానికి సరైన సమాధానం కనుగొనడమే గొప్ప బ్యాటర్ లక్షణమని సచిన్ అభిప్రాయపడ్డాడు. కెరీర్ చివరి బంతి వరకు కూడా సవాళ్లు ఉంటాయని, వాటిని ఎదుర్కొంటూ ఆటగాడు పరిపక్వత సాధిస్తాడని చెప్పాడు. వైభవ్‌లో ఇప్పటికే ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తోందని, అతని సహజ ప్రవృత్తులను దెబ్బతీసేలా అనవసర సూచనలు ఇవ్వడం మంచిది కాదని హెచ్చరించాడు.
టెస్ట్ క్రికెట్లో వైభవ్‌ను చూడాలని తాను మాత్రమే కాదు, ప్రతి క్రికెట్ అభిమాని కోరుకుంటాడని సచిన్ పేర్కొన్నాడు. అయితే ఆ అవకాశం ఎప్పుడు వస్తుందో చెప్పడం కష్టమని అన్నాడు. ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లకు ప్రోత్సాహం అవసరమని, వారు బాగా ఆడుతున్నప్పుడు మద్దతు ఇవ్వాలని సూచించాడు. ఎంపికల విషయంలో నిరంతరం ఒత్తిడి సృష్టించకుండా, ఆ బాధ్యతను సెలెక్టర్లకు వదిలేయాలని కూడా సచిన్ స్పష్టం చేశాడు.
భారత క్రికెట్ చరిత్రలో ఎంతో మంది ప్రతిభావంతులు ఎదిగారు. అయితే చిన్న వయసులోనే ఇంత భారీ ప్రభావం చూపిన ఆటగాళ్లు అరుదుగా కనిపిస్తారు. వైభవ్ సూర్యవంశీ విషయంలో ఇప్పుడు అందరి దృష్టి ఒకటే. అతడు ఎంత వేగంగా ఎదుగుతాడన్నది కాదు, ఆ ప్రతిభను ఎంత సమర్థంగా, దీర్ఘకాలిక కెరీర్‌గా మలుచుకుంటాడన్నదే అసలు పరీక్షగా మారింది.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!