Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Airtel: మొబైల్ ఖర్చులను తగ్గించుకోవాలనుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఎయిర్ టెల్ (Airtel) కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లను అందిస్తోంది. ప్రీపెయిడ్ లో భాగంగా ఉన్న రూ.469 ప్లాన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రూ.500 లోపే 84 రోజుల వ్యాలిడిటీ అందించడం ఈ ప్లాన్ ప్రత్యేకత. ముఖ్యంగా ఎయిర్ టెల్ ను సెకండరీ SIM గా ఉపయోగించే వారికి మంచి ఎంపికగా మారింది.
ఏంటి రూ.469 ప్లాన్?
ఈ ప్లాన్‌తో వినియోగదారులకు మొత్తం 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే దేశవ్యాప్తంగా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు ఫ్రీ నేషనల్ రోమింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. వీటికి తోడు 900 వరకు ఉచిత SMSలు అందిస్తారు. బ్యాంకింగ్ OTPలు లేదా సాధారణ మెసేజ్‌ల కోసం ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ ప్లాన్‌లో ఎలాంటి డేటా బెనిఫిట్స్ ఉండవు. పూర్తిగా కాలింగ్, సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవడానికే రూపొందించిన ప్లాన్ ఇది. అవసరమైతే వినియోగదారులు విడిగా డేటా ప్యాక్ రీచార్జ్ చేసుకోవచ్చు. వీటితోపాటు ఈ ప్లాన్‌తో ఏడాది పాటు ఉచిత Adobe ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తోంది. ఇంకా హలో ట్యూన్స్, స్పామ్ కాల్స్ నుంచి రక్షణ కలిగించే స్పామ్ ప్రొటెక్షన్ నెట్వర్క్ సదుపాయం కూడా ఉంటుంది.
Also Read
- Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
- Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
రూ.548 ప్లాన్:
కాలింగ్‌తో పాటు కొంత మొబైల్ డేటా కూడా కావాలనుకునే వారికి రూ.548 ప్లాన్‌ను అందిస్తోంది ఎయిర్ టెల్. ఈ ప్లాన్‌లో కూడా 84 రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాల్స్, ఫ్రీ రోమింగ్, 900 SMSలు లభిస్తాయి. వీటితో పాటు 84 రోజులకు గాను మొత్తం 7GB హైస్పీడ్ డేటా అందుతుంది. భారీగా డేటా ఉపయోగించని వారు, అప్పుడప్పుడు మెసేజింగ్, UPI పేమెంట్స్ లేదా లైట్ బ్రౌజింగ్ చేసే వారికి ఈ ప్లాన్ బాగా సరిపోతుంది. ఈ ప్లాన్‌లో కూడా Adobe ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సభ్యత్వం ఏడాది పాటు ఉచితంగా లభిస్తుంది.
డ్యూయల్-SIM మొబైల్ ఉపయోగించే వారు లేదా బ్యాకప్ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి ఇలాంటి లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్లు చాలా ఉపయోగపడుతున్నాయి. తరచూ రీచార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా సిమ్ యాక్టివ్‌గా ఉంటుంది. కాల్స్, OTPలు, బ్యాంకింగ్ సేవలు అంతరాయం లేకుండా కొనసాగుతాయి. వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎయిర్ టెల్ వంటి కంపెనీలు ఇప్పుడు వాయిస్-సెంట్రిక్ ప్లాన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. రోజువారీ భారీ డేటా అవసరం లేని వినియోగదారులకు తక్కువ ఖర్చుతో కూడిన ప్లాన్లు అందించాలన్న TRAI సూచనల తర్వాత ఇలాంటి ఆఫర్లు మరింత పెరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!