West Bengal: దోచుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాం.. “కట్‌మనీ”పై టీఎంసీలో భయం..
- టీఎంసీపై తిరగబడుతున్న బెంగాల్ ప్రజలు..
- ‘‘కట్‌మనీ’’ వ్యవహారంపై ప్రజల ఆగ్రహం..
- దోచుకున్న డబ్బు తిరిగిస్తామంటున్న టీఎంసీ నేతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal:పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత 15 ఏళ్లుగా చాలా మంది తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కార్యకర్తలు, నేతలు ప్రజలపై అనేక దోపిడీలకు పాల్పడ్డారు. ఇప్పుడు మమతా బెనర్జీ ఘోర పరాజయం తర్వాత, బీజేపీకి అధికారంలోకి రావడంతో ప్రజలు టీఎంసీపై తిరగబడుతున్నారు. చాలా ప్రాంతాల్లో తమను పీడించిన తృణమూల్ నేతలు, కార్యకర్తల బట్టలూడదీసి కొడుతున్నారు. ముఖ్యంగా ‘‘కట్‌మనీ’’ వ్యవహారంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ కట్‌మనీ వ్యవహారంపై సీఎం సువేందు అధికారి కూడా ప్రత్యేక దృష్టి సారించి, విచారణకు ఆదేశాలు ఇచ్చారు.
ఈ ఆగ్రహం కారణంగానే తృణమూల్ నేతలు భయపడుతున్నారు. ఇప్పుడు గతంలో తాము కట్ మనీ పేరుతో దోచుకున్న డబ్బును తిరిగి ఇస్తామని టీఎంసీ వాళ్లు బహిరంగంగా చెబుతున్నారు. కూచ్ బెహార్ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఘుఘుమారి పంచాయతీకి చెందిన టీఎంసీ సభ్యులు ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద అక్రమంగా వసూలు చేసిన మొత్తం ‘కట్ మనీ’ లేదా కమీషన్‌ను జూన్ 4వ తేదీలోగా తిరిగి చెల్లిస్తానని ఆటో రిక్షాలో తిరుగుతూ లౌడ్ స్పీకర్ పెట్టి మరీ చెబుతున్నారు.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
గ్రామస్తులు తీవ్ర నిరసన తెలుపుతున్న సమయంలో పరిస్థితి బాగా లేదని టీఎంసీ నేతలు దోచుకున్న డబ్బును ఇచ్చేందుకు లిఖిత పూర్వక హామీలు ఇస్తున్నారు. ఘుఘుమారి గ్రామ పంచాయతీలోని బూత్ నంబర్ 173కు చెందిన స్థానిక టీఎంసీ పంచాయతీ సభ్యురాలు జ్యోత్స్న బర్మన్ ఇంటి బయట పెద్ద సంఖ్యలో స్థానికులు నిరసన తెలిపారు. గృహ నిర్మాణ పథకం ప్రయోజనాలను కల్పించినందుకు టీఎంసీ నేతలు ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ. 5 వేల నుంచి రూ. 25 వేల వరకు వసూలు చేశారని గ్రామస్తులు ఆరోపించారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!