తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గపోరు నడుస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో వర్గాలు లేవని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో రాహుల్ వర్గం, సోనియా వర్గంగా నేతలు ఉంటారు తప్ప స్థానిక నేతలకు వర్గాలు ఉండవన్నారు. పార్టీలో వర్గాలు ఉన్నాయని ఎవరైనా అలా ఊహించుకుంటే వాళ్ల పొరపాటేనన్నారు. అయితే వ్యక్తులకు భిన్నాభిప్రాయాలు ఉంటాయని…. భావ వ్యక్తీకరణ అనేది మన…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. తాను టీఆర్ఎస్ ఏజెంట్‌గా పనిచేస్తున్నారని ఇటీవల కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు ప్రచారం చేస్తుండటంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. సదరు ఛానళ్లు రేవంత్‌రెడ్డికి అభిమానులుగా పనిచేస్తున్నాయని… రేవంత్‌కు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వకముందు మూడేళ్ల కిందటి నుంచే రాజు వస్తున్నాడంటూ తెగ హడావిడి చేసినట్లు గుర్తుచేశారు. ఇటీవల సంగారెడ్డి నియోజకవర్గంలో జరిగిన అధికారిక కార్యక్రమంలో తాను ఎమ్మెల్యే హోదాలో పాల్గొన్నానని… కేటీఆర్ ఎదురుపడితే పలకరించానని జగ్గారెడ్డి తెలిపారు.…
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అంటే..బస్సుకు డ్రైవర్ లాంటి వాడే అన్నారు. బస్సు చక్కగా లేకుంటే.. సరిద్దిద్దు కో అని చెప్పిన. ఇది కూడా చెప్పొద్దా..? కెసిఆర్ నా కంటే పెద్ద.. తిట్టను.. నా కంటూ ఓ పద్ధతి ఉంటుందన్నారు జగ్గారెడ్డి. తెలంగాణ ఉద్యమం సమయంలో కెసిఆర్ నీ సంగారెడ్డి కి ఎట్లా వస్తవో రా..? అని ఎదురు నిలబడ్డా. నా కంటే ఎక్కువ కొట్లాట చేసిర్ర ఎవరన్నా..? నా మీద చెయ్…
తెలంగాణ పోలీసులపై లోక్‌సభ స్పీకర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి పోలీసులు తన ఇంటిని చుట్టుముట్టారని…ఎలాంటి మౌఖిక సమాచారం, లిఖితపూర్వక సమాచారం లేకుండా తన ఇంటిని పోలీసులు మోహరించడం ఈ వారంలో ఇది రెండోసారి అని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. Read Also: ఫస్ట్ రేవంత్‌ను పిలిచి.. నన్ను పిలవండి: జగ్గారెడ్డి తెలంగాణ పోలీసులు తన హక్కులకు భంగం కలిగిస్తున్నారని లేఖలో రేవంత్‌రెడ్డి ఆరోపించారు.…
టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.. దీంతో.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. పౌర స్వేచ్ఛను కేసీఆర్ సర్కార్ హత్య చేస్తోందంటూ మండిపడ్డ ఆయన.. ప్రతిపక్ష నేతల ఇళ్లల్లోకి ఖాకీలను ఉసిగొల్పుతున్నాడు అని.. సన్నిహితులు, మిత్రులు, బంధువుల ఇళ్లలో పరామర్శలకు, శుభకార్యాలకు కూడా వెళ్లనీయని నిర్భందకాండకు ఈ దృశ్యం ఉదాహరణగా పేర్కొన్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమంత్రికి వెన్నులో వణుకుపుడుతోందన్న రేవంత్.. మేం ఇంట్లో…
సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాడని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రచ్చబండ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నేడు రేవంత్ రెడ్డి వరంగల్‌లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీని కోసం ఉదయం ఆయన సిద్ధంకాగా పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ఇంటి వద్ద భారీ పోలీసులు మోహరించారు. దీంతో రేవంత్ రెడ్డి ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత సోమవారం కూడా రేవంత్…
గడచిన మూడు నాలుగు నెలలుగా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల మరణ మృదంగం మోగుతుందని అధికారికంగానే నిత్యం ఐదు నుంచి పది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ అంశంపై రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఒక వైపు వరి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండగా, మరో వైపు మిర్చీ రైతుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని, నెలల తరబడి ధాన్యం కుప్పలపై పడిగాపులు కాస్తోన్న రైతు హఠాత్తుగా శవమై కనిపిస్తోన్న…
ఉద్యోగులు, ఉపాధ్యాయుల పోస్టింగ్ లలో స్థానికతను పరిగణనలోకి తీసుకోకపోవడం గురించి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలు ఉద్యోగులు, ఉపాధ్యాయులను మనో వేదనకు గురి చేస్తున్నాయి. ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలలో స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని లేఖలో కోరారు. ఇంకా ఆయన ఈ లేఖలో రాష్ట్రంలో కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన, బదిలీల కోసం ప్రభుత్వం డిసెంబర్ 6న జీవో నెంబర్ 317ను జారీ చేసింది.…
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మందు బాబులకు గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం… డిసెంబర్ 31వ తేదీతో పాటు, జనవరి 1న కూడా బార్లు, వైన్ షాపులు, స్పెషల్ ఈవెంట్లకు ప్రత్యేక అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.. డిసెంబర్ 31, 2022 జనవరి 1వ తేదీల్లో బార్లు, క్లబ్బులు అర్థరాత్రి ఒంటి గంట వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది.. ఇక, డిసెంబర్ 31న వైన్ షాపులు అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచే ఉండనున్నాయి.. బార్స్, ఈవెంట్స్,…