వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓ బ్లాక్ మెయిలర్, దొంగ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ అని.. ఇది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. ఈ మాట్లాడుతున్న మాటలు ఇతర కులాల్ని కించపరిచేలా ఉన్నాయని అన్నారు. రెడ్డి సామాజిక వర్గానికే అధికారం ఇవ్వాలని.. రెడ్డి సామాజిక వర్గానికే నాయకత్వం కట్టబెట్టాలని వ్యాఖ్యానించారని..…
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు ప్రస్తుతం కొండా సురేఖ, మురళీ దంపతుల చుట్టూ తిరుగుతున్నాయి. 2018లో పరకాలలో సురేఖ ఓటమి తర్వాత పెద్దగా చర్చల్లోకి వచ్చింది లేదు. రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్ అయ్యాక ఆయనకు దగ్గరయ్యారు. మరోసారి జిల్లాలో చక్రం తిప్పుతారని భావించాయి పార్టీ శ్రేణులు. ఇంతలో హుజూరాబాద్ ఉపఎన్నిక పీసీసీ చీఫ్, కొండా ఫ్యామిలీ మధ్య దూరం పెంచింది. అప్పటి నుంచి కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వరంగల్ తూర్పు తమ సొంత నియోజకవర్గంగా…
కర్నాటకలో జరిగిన రెడ్డి సామాజికవర్గం సమావేశంలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్స్ చుట్టూ కాంగ్రెస్‌లో చర్చతోపాటు రచ్చ రచ్చ అవుతోంది. రెడ్లకు పగ్గాలు అప్పగించాలన్న ఆయన కామెంట్స్‌పై కాంగ్రెస్‌లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అంశంపై సీరియస్‌గా స్పందించిన వీ హన్మంతరావు PACలో చర్చిస్తామని ప్రకటించారు. VH లోలోన రగిలిపోతున్నా… పార్టీ నేతలు ఎవరూ మీడియా ముందుకు వెళ్లొద్దన్న రాహుల్‌గాంధీ సూచనలతో వేచి చూస్తున్నట్టు చెబుతున్నారు. అయితే AICC కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్…
రెడ్లకు పగ్గాలిస్తేనే పార్టీలకు మనుగడ ఉంటుందంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సొంత పార్టీ నాయకులు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మూల విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ కుండబద్దలు కొట్టారు. తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన రేవంత్‌కు బహిరంగ లేఖ…
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూలేనంతగా కుల రాజకీయాలు మండిపోతున్నాయి. క్యాస్ట్ కుంపట్లతో చలి కాచుకునేందుకు చాలామంది నేతలు శతవిధాలా చిచ్చు రగిలిస్తున్నారు. తమ కుల ఓట్లను తిరిగి పొందేందుకో, లేదంటే ఒక కులాన్ని రెచ్చగొట్టి, మరో కులానికి దగ్గరయ్యేందుకో మాటల మంటలు రాజేస్తున్నారు. నిజాయితీగా ప్రజల జీవితాలు బాగుచెయ్యడానికి, వారీ జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి ఇదిగో ఇలాంటి పథకాలు తెస్తాం, అలాంటి కార్యక్రమాలు చేస్తామన్న హామీలను చెప్పడం లేదు. కులాల భావోద్వేగాలను అస్త్రాలుగా సంధిస్తున్నారు. ఓటు బ్యాంకు పాలిటిక్స్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎనిమిదేళ్లుగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు విఫలం అయ్యాయని విమర్శించారు. రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీ… తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అంశాలపై రేవంత్ పలు ప్రశ్నలు సంధిస్తూ సమాధానలు చెప్పాలని లేఖలో కోరారు. కాళేశ్వరంలో అవినీతిపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు…
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలకు మల్కాజగిరి డీసీసీ నందికంటి శ్రీధర్ కౌంటర్ ఇచ్చారు. ప్రజల సమస్యలకు సమాధానం చెప్పకుండా, మల్లారెడ్డి డ్రామాలాడారంటూ ఆరోపించారు. నీ చరిత్ర అందరికీ తెలిసిందేనని చెప్పిన ఆయన.. ‘జవహర్ నగర్లో కట్టిన ఆసుపత్రి నిర్మాణంలో తప్పు లేదా? కంటోన్మెంట్లో బీ1 ల్యాండ్‌లో కట్టిన ఫంక్షన్ హాల్ తప్పు కాదా?’ అంటూ నిలదీశారు. జోకర్‌లాగా మాట్లాడి, మీ సిగ్గు మీరే తీసుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. ‘రేవంత్ రెడ్డిని…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ త్వరలో జరగబోయే ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకోకూడదని, మీడియాకి ఎక్కి పార్టీ పరువును గంగపాలు చేయవద్దన్న సూచనలకు అనుగుణంగా తాజా పరిణామాలపై వీహెచ్ తనదైన రీతిలో స్పందించారు. రేవంత్ రెడ్డి పై వీహెచ్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి ఏ సందర్భంలో మాట్లాడినా బీసీ, ఎస్సీ ఎస్టీల లో ఒక విధమైన ఆలోచన వచ్చింది. కానీ నీ విషయంలో నేను బయట మాట్లాడలేను. నేను ఓబీసీ…
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీలకు సూచనలు చేశారు. మీ పార్టీలు గెలవాలన్న.. రాజకీయం చేయాలన్నా మీ పార్టీలను రెడ్ల చేతిలో పెట్టండి అన్నారు రేవంత్. రెడ్లను దూరం చేసినందుకు ప్రతాప రుద్రుడు ఓడిపోయి.. పతనం అయ్యాడు. రెడ్లకు అవకాశం ఇవ్వండి.. రాజకీయ పార్టీలు ఎట్లా గెలవవో చూస్తా. దానికి ఉదాహరణ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. రెడ్లను నమ్ముకున్నోడు ఎవడూ మోసపోలేదు… నష్టపోలేదన్నారు. ఆనాడు రెడ్డి బిడ్డ వైఎస్ రాజశేఖర్…
అక్కంపేట రచ్చబండలో భాగంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కౌంటర్ ఇచ్చారు. పార్టీ ఉనికి కాపాడుకోవడం కోసం రేవంత్ జోకర్ మాటలు మాట్లాడుతున్నారని, జయశంకర్ సార్ గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ బండికి జయశంకర్, కేసిఆర్‌లు జొడెడ్లలాగా పనిచేశారన్నారు. ఉద్యమ సమయంలో చంద్రబాబు రాసిన స్క్రిప్ట్‌లో రేవంత్ ఓ పాత్రదారుడని అన్నారు. తెలంగాణ రైతాంగం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు ఏమాత్రం లేదని మండిపడ్డారు. రైతు…