ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ నేడు, రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్‌లో కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన రైతు సంఘర్షణ సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ వెంట కేంద్ర రక్షణ దళం ఎన్ఎస్జి కమాండ్ తో పాటు వ్యక్తిగత జడ్ ప్లస్ సెక్యూరిటీ సిబ్బంది ఉండనుంది. బాంబు స్క్వాడ్, డాగ్ స్పైడర్ తో నిరంతర పర్యవేక్షణ.. ఎన్ఎస్జీ కమాండోలు వేదికకు వెనుక ముందు చుట్టుపక్కల రక్షణ వలయంల ఏర్పాటు చేస్తారు. వరంగల్…
తెలంగాణ పీసీసీ చీఫ్‌గా సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి… గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన తర్వాత.. పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.. కాంగ్రెస్ అధిష్టానంతో మంచి సంబంధాలు కలిగిఉన్న ఆయన.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు.. ఎన్టీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. అనేక విషయాలను వెల్లడించారు.. Read Also: Minister Amarnath: చంద్రబాబుకి పిచ్చి హిమాలయాలకు చేరింది వరంగల్ వేదికగా రాహుల్ గాంధీ డిక్లరేషన్ ప్రకటిస్తారని తెలిపారు ఉత్తమ్.. ఇది…
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారిపోయింది.. ఇది రాజకీయ దుమారానికి తెరతీసింది.. అదేస్థాయిలో కాంగ్రెస్ నేతలు కూడా కౌంటర్ ఎటాక్‌కు దిగారు.. అయితే, ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత రెండు రోజులుగా రాహుల్ గాంధీ వీడియో వైరల్ అవుతోంది.. పీసీసీ చీఫ్ రేవంత్‌కు దమ్ముంటే, మొనగాడు అయితే రాహుల్ గాంధీతో డ్రగ్స్ టెస్ట్ కోసం వెంట్రుకలు ఇప్పించాలని… వరంగల్…
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు.. తెలంగాణ హైకోర్టు న్యాయవాది రామారావు హెచ్ఆర్సీలో ఈ ఫిర్యాదు చేశారు.. కాంగ్రెస్ పార్టీ శాంతిభద్రతల సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తోందని తన ఫిర్యాదులో ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణలు ప్రేరేపించే విధంగా వారి వ్యవహారం ఉందంటూ హెచ్ఆర్సీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. Read Also: Rahul Gandhi in Pub: సాయిరెడ్డికి ఠాగూర్ స్ట్రాంగ్…
తెలంగాణలో వచ్చే 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుందని తెలిపారు తెలంగాణ పీసీసీ చీప్ రేవంత్‌రెడ్డి.. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై స్పందించారాయన.. ఈ సందర్భంగా ఎన్నికలు, అధికారం గురించి మాట్లాడుతూ.. 2023 నుంచి 2033 వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటుందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. 94 నుంచి 2004 టీడీపీ, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్, 2014 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ పార్టీలు పదేళ్లు అధికారంలో…
కాంగ్రెస్ పార్టీ పరేడ్ గ్రౌండ్ లాంటిది, అక్కడ ఎవడి ఆట వాడు ప్రాక్టీస్ చేసుకుంటారు.. ప్రత్యర్థి ఎదురైనప్పుడు అంతా కలిసి ఆడతారు అని తెలిపారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి… ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలోని పరిస్థితులు, టీఆర్ఎస్పై ఉన్న వ్యతిరేకత, బీజేపీ విధానాలు ఇలా అన్నింటిని ఎండగట్టారు.. ఇదే సమయంలో, కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుపై స్పందిస్తూ.. పై వ్యాఖ్యు చేశారు.. ఇక, కేసీఆర్‌కు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించిన రేవంత్ రెడ్డి.. నిజాం…
తెలంగాణలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీపీసీసీ. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతల్ని నిలువరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. నిన్న హైదరాబాద్ లో విద్యార్థి నాయకుల అరెస్టులకు నిరసనగా సోమవారం కేసీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం చేయాలని టీపీసీసీ అధ్యక్షేులు రేవంత్ పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించినందుకు ఎన్ఎస్…
జగ్గారెడ్డి అరెస్ట్‌పై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. అరెస్టైన వారిని పరామర్శించడానికి పోతే.. అరెస్టులు చేస్తారా అంటూ.. కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ టీపీసీసీ ప్రెసిడెండ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి జగ్గారెడ్డిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీ కి రాహుల్ గాంధీ తప్పకుండా వెళ్తారని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమంలో విద్యార్ధుల పాత్ర కీలకమని, ఉస్మానియా యూనివర్సిటీ కేసీఆర్ నా జాగీరు అనుకుంటున్నారని ఆయన అగ్రహం వ్యక్తం…
ఓయూలోని అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌ను ముట్టడించేందుకు వెళ్లిన ఎన్ఎస్యూఐ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే అరెస్టైన విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో జగ్గారెడ్డి అరెస్ట్‌పై జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ స్పందించారు. ప్రశ్నించే గొంతుకలు విశ్వవిద్యాలయాలని ఆయన అన్నారు. ఓయూ కు రాహుల్ వచ్చేలా అనుమతి ఇవ్వాలని విద్యార్థులు నిరసన తెలపడానికి వెళ్లితే వారిని అరెస్ట్ చేసి పోలీస్…