మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. టైం, డేట్ కేటీఆర్ ఖరారు చేయాలని, ప్రజల మధ్య తేల్చుకుందాం రేవంత్ అన్నారు. కేటీఆర్ ఎక్కడ చెబితే అక్కడ చర్చకు నేను రెడీ అంటూ ఛాలెంజ్ చేశారు.
కాంగ్రెస్- బీజేపీ వాళ్ళు సొల్లు మాటలు చెప్పుతారు.. రేవంత్ రెడ్డి ఛత్తీస్ ఘడ్ పాలన అంటున్నాడు.. ఛత్తీస్ గడ్ పాలన అంటే అయిదు వందల పెన్షన్ ఇస్తారా అని హరీశ్ రావు విమర్శిస్తారు.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పాదయాత్ర చేపట్టారు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. హాత్ సే హాత్ జోడో యాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పీసీసీ చీఫ్ ముందుకు సాగుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో పెద్ద రెడ్లు కేసీఆర్ కు అమ్ముడు పోయారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. సీనియర్ల పై నేను చేసిన వ్యాఖ్యలు అంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని అసలు ఆ ప్రస్తావన తేలేదని టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మా పార్టీలో పెద్ద రెడ్లు కేసీఆర్ కు అమ్ముడు పోయారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాబట్టే కొత్త తరానికి అవకాశం వచ్చిందని అన్నారు.