ప్రజలు అన్న మాటలే నేను, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. సిట్ అంటే సీఎం సిట్ అంటే సిట్... స్టాండ్ అంటే స్టాండ్ అంటూ ఎద్దేవ చేశారు.
తాడు బొంగరం లేని వాల్లంతా పేపర్ లీక్ పై మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ లో కార్యకర్తలతో తలసాని మాట్లాడుతూ.. అందరికీ పదవులు సాధ్యం కాదు.. ప్రభుత్వంలో పరిమిత సంఖ్యలో పదవులు ఉంటాయన్నారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో హాత్ సే హాత్ జోడో యాత్ర కు ఐదు రోజుల పాటు బ్రేక్ పడనుంది. ఉగాది పండుగ, ఇతరత్రా కారణాలతో ఈనెల 25 వరకు రేవంత్ రెడ్డి పాదయాత్రకు బ్రేక్ వేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రాష్ట్రవ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందని అన్నదాతకు అపార నష్టం వాటిల్లిన తెలంగాణ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తుందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
అప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు.. ఇప్పుడు ప్రశ్నాపత్రాల కొనుగోలు.. అక్కడ కేసీఆర్.. ఇక్కడ కేటీఆర్ పాత్రదారులంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. నిరుద్యోగుల పాలిట రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద సమస్యగా మారిందని మండిపడ్డారు.
కస్టడీ లోకి తీసుకోక ముందు , విచారణ చేయక ముందే ఇద్దరు మాత్రమే బాద్యులు అని కేటీఆర్ ఎలా చెపుతారు? అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా పర్యటనలో వున్న రేవంత్ రెడ్డి పేపర్ల లీకులపై ధ్వజమెత్తారు.