Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరింది.. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత తొలి కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ పనితీరుపై చర్చ జరిగి.. విద్యుత్ శాఖలో ఏం జరిగిందో వివరిస్తూ సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఇంతకాలం ఆ శాఖలో నిజానిజాలు బయటపెట్టడం లేదంటూ ఆ శాఖ ఉన్నతాధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విద్యుత్ సంక్షోభం తెచ్చేందుకు కుట్ర పన్నారని సీఎం రేవంత్ అభిప్రాయపడినట్లు సమాచారం. విద్యుత్ సంస్థలకు ఇప్పటి వరకు రూ.85 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని అధికారులు సీఎంకు చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై నేడు సమీక్షిస్తానని చెప్పి ఆ శాఖకు సంబంధించిన పూర్తి వివరాలతో సిద్ధం కావాలని రేవంత్ ఆదేశించినట్లు సమాచారం. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేశారని.. దానిని ఆమోదించకుండా ఇవాళ (శుక్రవారం) సమీక్ష సమావేశానికి పిలవాలని సీఎం ఆదేశించారు. విద్యుత్ శాఖపై ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు.
Read also: Congress : తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్‌పై కాంగ్రెస్ ‘గ్యారెంటీలు’ ఎంత భారంగా మారనున్నాయి?
కేబినెట్ భేటీలో ఆరు హామీల చట్టంపై సుదీర్ఘ చర్చ జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ ప్రజలకు మంత్రివర్గం కృతజ్ఞతలు తెలిపిందని.. 2014 నుంచి 2023 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిసెంబర్ 7న అన్ని శాఖల వివరాలపై చర్చ జరిగిందని తెలిపారు. 2014 నుంచి డిసెంబర్ 2023 వరకు అన్ని శాఖల నిధుల ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని అధికారులను కోరారు.ఆరు హామీల్లో రెండు హామీలను అమలు చేయాలని నిర్ణయించారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రెండు హామీల అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతులకు, పరిశ్రమలకు 24 గంటల కరెంటు ఇవ్వాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. 2014 నుంచి గత ప్రభుత్వం కరెంటులో అనేక తప్పులు, సమస్యలు, ప్రణాళిక లేకుండా ఆలోచించిందని.. నేడు విద్యుత్‌పై సీఎం సమీక్షిస్తారని చెప్పారు. ప్రజలకు అంతరాయం లేకుండా నిరంతరాయంగా విద్యుత్ అందించాలని కేబినెట్ ఆమోదించిందని తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని తెలిపారు. 9వ తేదీన కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందన్నారు.
Read also: Astrology: డిసెంబర్ 08, శుక్రవారం దినఫలాలు