రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)కు సంజయ్ మల్హోత్రా కొత్త గవర్నర్‌గా నియమితులయ్యారు. సంజయ్ మల్హోత్రా భారత ప్రభుత్వ రెవెన్యూ విభాగానికి కార్యదర్శిగా పని చేశారు. కాగా.. సంజయ్ మల్హోత్రాను దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నివేదించారు. శక్తికాంత్ దాస్ లాగానే మల్హోత్రా కూడా IAS అధికారి. అతను 1990 బ్యాచ్ రాజస్థాన్ కేడర్‌కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ రెండో త్రైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాన్ని ఈరోజు (డిసెంబర్ 6) ప్రకటించనుంది. అయితే, ఈసారి కూడా కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచే ఛాన్స్ ఉంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ కాల్ రిజర్వ్ బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్‌కు చేయబడింది. ఫోన్ చేసిన వ్యక్తి తాను లష్కరే తోయిబా సీఈఓనని చెప్పాడు. శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో రిజర్వ్ బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్‌కు ఈ కాల్ వచ్చింది. ఫోన్‌లో ఉన్న వ్యక్తి.. "నేను లష్కరే తోయిబా సీఈఓని, బ్యాక్‌వే మూసేయండి. ఎలక్ట్రిక్ కారు చెడిపోయింది." అని చెప్పాడు.
RBI Repo Rate: భారతదేశ ఆర్థిక వృద్ధిని పెంచేందుకు డిసెంబర్ మాసంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తన కీలక పాలసీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. మొత్తంగా 25 బేసిస్ పాయింట్స్ తగ్గించి 6.25 శాతానికి చేరుకుంటుంది. ఇకపోతే, సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం 5.49 శాతానికి పెరగగా, ప్రస్తుత త్రైమాసికంలో ఇది 4.9 శాతానికి పడిపోతుందని అంచనా వేస్తున్నారు ఆర్థికవేత్తలు. అంతేకాకుండా ఆ తర్వాతి జనవరి-మార్చి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం…
RBI : భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎస్ జీ ఫిన్సర్వ్ లిమిటెడ్ కు 28.30 లక్షల జరిమానా విధించారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌కు సంబంధించిన కొన్ని షరతులను పాటించనందుకు కంపెనీకి జరిమానా విధించబడింది.
UPI Transaction: ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను ప్రకటించిన గవర్నర్ శక్తికాంత దాస్.. డిజిటల్ పేమెంట్స్‌కు సంబంధించి కీలక నిర్ణయాలను ప్రకటించారు. ఈ సందర్భంగా యూపీఐ లైట్ వ్యాలెట్ పరిమితి రూ.5 వేలకు పెంచినట్లు పేర్కొన్నారు.
RBI Interest Rates: విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ భేటీ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ ఈరోజు (బుధవారం) ప్రకటించారు.
Credit Card Rules Change : క్రెడిట్ కార్డు హోల్డర్లకు గుడ్ న్యూస్. నేటి నుంచి కొత్త క్రెడిట్ కార్డ్ రూల్ అమల్లోకి వచ్చింది. కస్టమర్‌లు తమ ఇష్టపడే నెట్‌వర్క్‌ని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం.. కస్టమర్ క్రెడిట్ కార్డ్‌ను మూసివేయాలని అభ్యర్థిస్తే.. సదరు బ్యాంకు, సంస్థ దానిని 7 రోజుల్లోపు అమలు చేయాల్సిందే.. కార్డును జారీ చేసే బ్యాంకు లేదా సంస్థ అలా చేయకపోతే.. 7 రోజుల తర్వాత, దానిపై రోజుకు 500 రూపాయల జరిమానాను వినియోగదారుడికి ఆయా బ్యాంకులు చెల్లించాల్సి ఉంటుంది.