Credit Card Rules Change : క్రెడిట్ కార్డు హోల్డర్లకు గుడ్ న్యూస్. నేటి నుంచి కొత్త క్రెడిట్ కార్డ్ రూల్ అమల్లోకి వచ్చింది. కస్టమర్‌లు తమ ఇష్టపడే నెట్‌వర్క్‌ని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటారు. మీరు ప్రయోజనకరంగా భావించే మాస్టర్ కార్డ్, రూపే, వీసా కార్డ్‌లలో దేనినైనా సెలక్ట్ చేయమని మీరు క్రెడిట్ కార్డ్ కంపెనీలకు చెప్పవచ్చు. మీ కోరిక మేరకు కొత్త కార్డు మంజూరు చేయబడుతుంది. అలాగే రెన్యువల్ కార్డులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. అలాగే డిజిటల్ చెల్లింపుల్లో పోటీని పెంపొందించే లక్ష్యంతో ఈ నిబంధన తీసుకొచ్చారు.
ఇంతకుముందు, బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ సంస్థలు ఒకే కార్డ్ నెట్‌వర్క్‌తో ప్రత్యేక ఏర్పాట్ల ఆధారంగా క్రెడిట్ కార్డులను జారీ చేసేవి. దీంతో వినియోగదారులకు వేరే మార్గం లేకపోయింది. కాబట్టి, బ్యాంకులు ఏ కార్డు జారీ చేస్తే వినియోగదారులు తప్పనిసరిగా ఆ కార్డును తీసుకోవాలి. సెప్టెంబరు 6 నుంచి ఖాతాదారులు తమకు కావాల్సిన కార్డును బ్యాంకుల నుంచి జారీ చేయాల్సి ఉంటుంది.
Read Also:KCR Navagraha Yagam: ఎర్రవల్లిలో కేసీఆర్ దంపతులు నవగ్రహ యాగం..
ఈ నియమం రెన్యూవల్ కార్డ్‌లకు కూడా వర్తిస్తుంది. ప్రస్తుతం మాస్టర్ కార్డ్ లేదా వీసా కార్డ్‌లను ఉపయోగిస్తున్న కస్టమర్‌లు రూపే కార్డ్‌లకు మారవచ్చు. మీరు పాతదాన్ని కొనసాగించాలనుకుంటే, మీరు కొనసాగించవచ్చు. యెస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు ఇప్పటికే ఈ నిబంధనను అమలు చేశాయి. కార్డ్ నెట్‌వర్క్‌ను ఎంచుకునే ఎంపిక వినియోగదారులకు ఇవ్వబడుతుంది. సెప్టెంబర్ 6 నుంచి దేశంలోని అన్ని బ్యాంకులు ఈ నిబంధనను కచ్చితంగా పాటించనున్నాయి. ఈ నిబంధనలకు సంబంధించి ఆర్‌బీఐ మార్చిలోనే సర్క్యులర్ జారీ చేసింది. అయితే యాక్టివ్ కార్డులు 10 లక్షల కంటే తక్కువ ఉన్న సంస్థలు , అలాగే సొంత నెట్వర్క్ ఆథరైజేషన్ కలిగి ఉన్న సంస్థలు ఈ రూల్ పాటించాల్సిన అవసరం లేదని ఆర్బీఐ సర్క్యూలర్ లో తెలిపింది.
ఇంతలో UPI యాప్‌లకు RuPay కార్డ్‌ని ఇంటిగ్రేట్ చేసే ఆప్షన్ ఉంది. Google Pay వంటి యాప్‌లలో రూపే కార్డ్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. బిజినెస్ అకౌంట్లకు మాత్రమే చెల్లింపు సౌకర్యం ఉంది. దీనికి ఎలాంటి అదనపు ఛార్జీలు లేవు. సేవింగ్స్ ఖాతా వలె రూపే కార్డును ఉపయోగించవచ్చు. కాకపోతే బిల్లు వచ్చిన తర్వాత గడువు తేదీలోగా చెల్లించాలి.
Read Also:WhatsApp Update: కొత్తగా కాల్ లింక్ ఫీచర్.. ఎలా ఉపయోగించుకోవాలంటే..