CM Revanth Reddy: పాశమైలారం పరిశ్రమ ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. రేపు ఘటనా స్థలం సందర్శన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై స్పందించిన ఆయన, బాధితుల కుటుంబాలకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం (జులై 1) ఉదయం 10 గంటలకు స్వయంగా ఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించనున్నారు. సహాయక చర్యల పురోగతిపై ఎప్పటికప్పుడు మంత్రి దామోదర రాజనర్సింహ, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడుతూ సమీక్షించారు.
Read Also:DRDO: బంకర్-బస్టర్ బాంబుల తయారీకి భారత్ అడుగులు.. దీని ప్రత్యేకత ఏంటి..?
Also Read
- Central Cabinet Decision: తెలుగు రాష్ట్రాల్లో 4 లేన్ల రైల్వే ట్రాక్‌లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
- Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
అలాగే ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు మరింత వేగంగా చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఈ చర్యలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీను ఏర్పాటు చేశారు. ఇందులో సీఎస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పెషల్ సీఎస్, లేబర్ డిపార్టుమెంట్ పీఎస్, హెల్త్ సెక్రటరీ, అడిషనల్ డీజీ (ఫైర్ సర్వీసెస్) ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు తక్షణ సాయం అందించేందుకు ఆదేశాలు జారీ చేశారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించేందుకు ఆసుపత్రులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
Read Also:Team India Schedule: ఇంగ్లండ్ పర్యటనలో మూడు భారత జట్లు.. జులై షెడ్యూల్ ఇదే!
ఇప్పటివరకు 15 మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది బయటకు తీసినట్లు తెలుస్తుంది. అయితే, ఈ సంఖ్యపై స్పష్టమైన సమాచారం అందాల్సి ఉంది. వీరిలో ముగ్గురి వివరాలే ఇప్పటివరకు గుర్తించగలిగారు. మిగిలిన 12 మృతదేహాలను డీఎన్ఏ పరీక్షల అనంతరం కుటుంబాలకు అప్పగించనున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఐదుగురి పరిస్థితి తీవ్రంగా ఉంది. అంతేగాక, శిథిలాల కింద ఇంకా 15 మంది కార్మికులు ఉన్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సహాయక చర్యలు మరింత ముమ్మరంగా చేపట్టడానికి అధికారులు ప్రయత్నిస్తుండగా.. ఆ ప్రాంతంలో భారీగా వర్షం కురవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.
తాజావార్తలు
-
AI Danger Warning: Anthropic పరిశోధకుడు రాజీనామా.. షాకింగ్ వార్నింగ్.. ఈ దశాబ్దం చివరికి AIతో మానవాళికి ముప్పు?
-
Central Cabinet Decision: తెలుగు రాష్ట్రాల్లో 4 లేన్ల రైల్వే ట్రాక్‌లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Uday Krishna Reddy : ఉదయ్ కృష్ణారెడ్డికి హైకోర్టు బిగ్ రిలీఫ్.. పొటెన్సీ టెస్ట్‌పై కీలక ఆదేశాలు.!
-
Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
-
Tollywood Stars : ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్స్‌కు పరుగులు ఎందుకు?
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!