Gujarat Govt : దేశ చరిత్రలో అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఓ మాయని మచ్చలా మిగిలిపోయింది. దేశంలోనే అతిపెద్ద విమాన ప్రమాదంగా ఇది నిలిచింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 275 మంది చనిపోయినట్టు గుజరాత్ ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. ఇందులో 241 మంది ప్రయాణికులు ఉండగా.. 34 మంది స్థానికులు ఉన్నట్టు గుజరాత్ ఆరోగ్యశాఖ స్పస్టం చేసింది. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పుడే అధికారికంగా గుజరాత్ ఈ వివరాలను వెల్లడించింది.
Read Also : Rammohan Naidu : బ్లాక్ బాక్స్ పై ఇండియాలోనే విచారణ : రామ్మోహన్ నాయుడు
ఇందులో చనిపోయిన వారిలో 256 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించామని.. మిగతా వారిని గుర్తిస్తున్నట్టు తెలిపింది. డీఎన్ ఏ, ఇతర పోలికల ఆధారంగా వారిని గుర్తిస్తున్నట్టు చెప్పింది ప్రభుత్వం. చనిపోయిన వారిలో 120 మంది మగవారు, 124 మంది ఆడవారు, 16 మంది చిన్నారులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
Read Also : Kannappa : కన్నప్పకు అదే అతిపెద్ద సమస్య..?