ఒడిశా రైలు ప్రమాద స్థలంలో బాధితులను కాపాడేందుకు శుక్రవారం రాత్రి ప్రారంభించిన రెస్క్యూ ఆపరేషన్ నిన్న (శనివారం) మధ్యాహ్నం ముగిసిందని రైల్వే అధికారులు తెలిపారు. దీంతో ట్రాక్ పునరుద్ధరణ పనులు ప్రారంభం అయ్యాయని వెల్లడించారు.
కామారెడ్డి జిల్లాలో పులిగుట్ట అడవిలో వేటకు వెళ్లి మొన్న గుహలో చిక్కుకున్న రాజు ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డాడు. రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన చాడ రాజు మంగళవారం మధ్యాహ్నం రాళ్ల గుట్టల సందుల్లో ఇరుక్కుపోయాడు. ఈనేపథ్యంలో దాదాపు 43 గంటలకు పైగా నరకయాతన అనుభవించాడు రాజు.
పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ సింగరేణిలోని బొగ్గు గనిలో పైకప్పు కూలిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఏడుగురు పనిచేస్తుండగా ఒకరు మాత్రమే సురక్షితంగా బయటకు రాగా ఆరుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. తొలుత వారు మరణించారని ప్రచారం జరిగింది. అయితే సోమవారం రాత్రి సమయంలో ఇద్దరు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. మరో నలుగురు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు సహాయక బృందం…
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హెలికాప్టర్ ప్రమాదం జరిగిన ప్రాంతంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. చాపర్ ఎలా కూలింది, కారణాలేంటి అనేది అన్వేషణ కొనసాగుతోంది.