అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక రిపోర్టుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారం వ్యక్తం చేసింది. జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఎయిరిండియా విమానం కూలిపోయింది. దాదాపు 271 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ప్రమాదంపై రెండు సంస్థలు దర్యాప్తు చేపట్టాయి.
అగ్ర రాజ్యం అమెరికా-భారత్ మధ్య సుంకాల వార్ నడుస్తోంది. నిన్నామొన్నటిదాకా మంచి స్నేహ సంబంధాలు ఉన్న దేశాలు.. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్‌పై తొలుత 25 శాతం సుంకాన్ని ట్రంప్ విధించారు. ఇది ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చింది.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా-ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం మధ్య తీవ్ర రాజకీయ యుద్ధం సాగుతోంది. గతేడాది జరిగిన అల్లర్ల కారణంగా షేక్ హసీనా.. బంగ్లాదేశ్ నుంచి పారిపోయి భారత్‌లో తలదాచుకుంటున్నారు.
‘బాక్సాఫీస్ క్వీన్’ సాయిపల్లవి ఇటీవలే ‘అమరన్’తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో ‘తండేల్’ చిత్రంలో నాగ చైతన్య సరసన నటిస్తున్న సాయిపల్లవి.. బాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’లో నటించడానికి సిద్ధమయ్యారు. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణలో రాముడిగా రణ్‌బీర్ కపూర్.. సీతగా సాయిపల్లవి కనిపించనున్నారు. బాలీవుడ్ నిర్మాతలతో కలిసి టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రామాయణ సినిమా కోసం…
మహారాష్ట్రలో ఇండియా కూటమిలో సీట్ల పంపకాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు శివసేన(యూబీటీ) నేతలు తెలిపారు. సీట్ల పంపకాలపై ఇండియా కూటమిలో విభేదాలు వచ్చినట్లు వార్తలు వినిపించాయి. శివసేన(యూబీటీ) ఒంటరిగా పోటీ చేస్తుందని వార్తలు షికార్లు చేశాయి.
ఆపిల్ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రపంచ దిగ్గజ సంస్థ భారత్‌లో తన సేవలను విస్తరించేందుకు యోచిస్తోంది. ఇందులో భాగంగా భారతదేశంలో మరో నాలుగు కొత్త రిటైల్ స్టోర్లను ప్రారంభించాలని ఆపిల్ యోచిస్తోందని తెలుస్తోంది. బెంగుళూరు, పూణె, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబైలో నాలుగు కొత్త రిటైల్ స్టోర్లను ప్రారంభించాలని ఆపిల్ ఆలోచన చేస్తోంది.
పన్ను వ్యతిరేక నిరసనలతో కెన్యా రణరంగంగా మారింది. పార్లమెంట్ ముట్టడికి పెద్ద ఎత్తున ఆందోళనకారులు తరలిరావడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. పోలీసులు, భద్రతా సిబ్బంది నిరసనకారులపై టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగులు, తుపాకీ కాల్పులకు పాల్పడ్డారు.
రెండేళ్ల కిందటివరకు కూడా ప్రపంచంలోనే మోస్ట్ వాల్యూడ్ ఎడ్‌టెక్ కంపెనీగా ఉన్న బైజూస్., ఇప్పుడు మాత్రం పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉంది. కంపెనీ ప్రస్తుతం తీవ్ర ద్రవ్య కొరతను ఎదుర్కొంటోంది. బైజూస్ సంస్థలోని ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉందంటే నమ్మండి. ఇదివరకు ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు తాను ఎంతో ఇష్టంగా కట్టుకున్న తన ఇంటిని కూడా తాకట్టు పెట్టేందుకు బైజూస్ అధినేత రవీంద్రన్ సిద్ధపడ్డాడు. వాటితోపాటు అనేక విలువైన ఆస్తులను కూడా అమ్ముకున్నట్లు సమాచారం.…