(సెప్టెంబర్ 27న నగేశ్ జయంతి) నగేశ్ తెరపై కనిపిస్తే చాలు నవ్వులు విరబూసేవి. నగేశ్ తో నటనలో పోటీపడడం అంతసులువేమీ కాదని కమల్ హాసన్ వంటి విలక్షణ నటుడు కూడా అంటారు. దీనిని బట్టే నగేశ్ టైమింగ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ఎదురుగా ఎంతటి మహానటులు ఉన్నా వారికి దీటుగా నటించేసి మెప్పించేవారు నగేశ్. కామెడీ అంటేనే కత్తిమీద సాము. అలాంటి సాములు బోలెడు చేసి భళా అనిపించారు నగేశ్. ఇక ఆయన నర్తనంలోనూ తనదైన…