నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి మరోసారి రాముడి జన్మస్థలంపై చర్చను ప్రారంభించారు. రాముడు, శివుడు, విశ్వామిత్రుడు వంటి దేవతలు నేపాల్ లోనే పుట్టారని మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాఠ్‌మాండులో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఓలి పాల్గొని ప్రసంగించారు. శ్రీరాముడు నేపాల్ లోనే జన్మించాడని పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని ప్రచారం చేయడంతో దేశ ప్రజలు వెనకడుగు వేయొద్దన్నారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తాజాగా శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో జ్యోతిర్మఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి పెద్ద ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ ఇకపై హిందూ మతంలో భాగం కాదని ఆయన అన్నారు. అతన్ని హిందూ మతం నుంచి బహిష్కరిస్తామని ప్రకటించారు. బద్రీనాథ్‌లోని శంకరాచార్య ఆశ్రమంలో స్వామి అవిముక్తేశ్వరానంద మాట్లాడుతూ..
Namaz: ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్‌లో నేషనల్ సర్వీస్ స్కీమ్(ఎన్ఎస్ఎస్) క్యాంపులోని విద్యార్థులతో ఓ ప్రొఫెసర్ బలవంతంగా నమాజ్ చేయించేందుకు ప్రయత్నించాడు. ఈ కేసుకు సంబంధించి గురు ఘాసిదాస్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనలో 8 మందిపై ఏప్రిల్ 26న ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఈద్ ప్రార్థనలపై మరోసారి రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. ఢిల్లీలోని కొంతమంది బీజేపీ నాయకులు 'రోడ్డుపై నమాజ్'కు వ్యతిరేకంగా చేసిన ప్రకటనల తర్వాత.. అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఏఐఎమ్‌ఐఎమ్ రంగంలోకి దిగింది. ఇది ఢిలలీ, సంభాల్ లేదా మీరట్ కాదని మసీదులో స్థలం కొరత ఉంటే రోడ్డుపై కూడా నమాజ్ చేస్తామని ఏఐఎమ్‌ఐఎమ్ రాష్ట్ర అధ్యక్షుడు షోయబ్ జమాయ్ అన్నారు. దీనికి ఆయన కన్వర్ యాత్ర వాదనను ఇందులో ప్రస్తావించారు.
ఓ మహిళ జగన్నాథ స్వామి పచ్చబొట్టు వేయించుకోవడంపై వివాదం తలెత్తింది. ఈ విదేశీ మహిళ తన తొడపై జగన్నాథుడి బొమ్మను టాటూగా వేయించుకుంది. ఆ విదేశీ మహిళ భువనేశ్వర్‌లోని ‘రాకీ టాటూస్’ పార్లర్‌లో ఈ టాటూ వేయించుకుంది. ఇది మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. ఈ అంశంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. టాటూ ఆర్టిస్ట్, పార్లర్ యజమాని రాకీ రంజన్ బిషోయ్‌ను అరెస్టు చేశారు. వాస్తవానికి ఆ మహిళ తొడపై టాటూ వేసుకోవడంతో పాటు దానికి…
MLA Raja Singh : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేసే కుట్రలు జరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. వైఎస్సార్ ప్రభుత్వం ఉన్న టైంలో కూడా చాలావరకు ముస్లింలకు శ్రీశైలం పుణ్యక్షేత్ర ప్రాంగణంలో అనేక షాప్ లు ఇచ్చారని, అప్పుడు హిందూ.. ఇతర సంఘాలు కోర్టుకు వెళ్ళారు.. స్టే కూడా తెచ్చుకున్నారన్నారు. నిన్న శివ స్వాములు ముస్లింలకు ఎందుకు షాప్ లు ఇచ్చారని ప్రశ్నిస్తే వారిపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారన్నారు. మహా శివరాత్రికి…
Vemulawada : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో అపచారం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు తమ పుట్టిన రోజులతో పాటు క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఉండే యాచకులకు, నిరాశ్రయులకు మాంసాహారంతో కూడిన ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. అయితే ఆలయ పరిసరాల్లోకి మాంసాహారం తీసుకు వెళ్ళొద్దనే నిబంధనలు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ప్రధాన ఆలయం సమీపంలోనికి వెళ్లి మాంసాహారంతో కూడిన ఆహారం పంపిణీ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. విషయం తెలుసుకున్న…