త్వరలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ 11వ జాబితాను విడుదల చేసింది. ఇందులో రెండు పార్లమెంట్, ఒక అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ ఇంఛార్జులను ప్రకటించింది. కర్నూలు పార్లమెంట్ ఇంఛార్జుగా బీవై రామయ్య, అమలాపురం పార్లమెంట్ ఇంఛార్జుగా రాపాక వరప్రసాద్, రాజోలు అసెంబ్లీ ఇంఛార్జుగా గొల్లపల్లి సూర్యారావు పేర్లను ప్రకటించింది.
లోక్ సభ ఎన్నికల అభ్యర్థులకు సంబంధించి మొదటి జాబితాపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేసింది. ఈరోజు.. 10 రాష్ట్రాల నుంచి దాదాపు 60 సీట్లకు అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది. తెలంగాణలో 9 మందితో మొదటి జాబితా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2024 మార్చి 22న ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికొస్తే, కొత్త ప్లేయర్స్ తో బలంగా ఉంది. ఇప్పటికే ఐడెన్ మార్క్రమ్ ను కెప్టెన్ గా తొలగించి, ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ప్యాట్ కమిన్స్ కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. జట్టులోనూ భారీగా మార్పులు చేపట్టింది. మరోవైపు.. ఈరోజు కొత్త జెర్సీని కూడా విడుదల చేసింది.
తెలంగాణ ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు ఈరోజు విడుదలయ్యాయి. వాటిని ఇంటర్మీడియట్ బోర్డు ఆన్ లైన్ లో విడుదల చేసింది. కాగా.. ఇంతకుముందు కళాశాలల ప్రిన్సిపాళ్ల లాగిన్ ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ కు అవకాశం ఉండేది. కానీ తాజాగా.. విద్యార్థులే నేరుగా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశాశ్ని కల్పించింది. అయితే.. అధికారిక వెబ్ సైట్ tsbie.cgg.gov.in నుంచి విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. ఇంటర్…
ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్ లాంటిది. ఐపీఎల్ 17వ సీజన్ షెడ్యూల్ విడుదలైంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ మార్చి 22న హోమ్ గ్రౌండ్ ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో చెన్నై తలపడనుంది. మొత్తం.. 21 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. సాధారణంగా డిఫెండింగ్ చాంపియన్- రన్నరప్ మధ్య మ్యాచ్‌తో క్యాష్ రిచ్ లీగ్ కొత్త ఎడిషన్ ఆరంభించడం…
తెలంగాణలో గ్రూప్- 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ కాసేపటి క్రితమే విడుదలైంది. కాగా.. గతేడాది ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసిన టీఎస్పీఎస్సీ.. గంటల వ్యవధిలోనే కొత్త నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. మొత్తం 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 23 నుండి మార్చి 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే లేదా జూన్ లో ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో మెయిన్స్ పరీక్ష ఉండనుంది. అయితే.. ఇంతకు ముందు…
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శుభవార్త చెప్పింది. ఎల్లుండి నుంచి ఆన్లైన్లో మే నెల దర్శన టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. మే నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, అంగ ప్రదక్షిణం, వసతి గదుల కోటా విడుదలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. మే నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం రిజిస్ట్రేషన్ ఈ నెల 19న ఉదయం…
సివిల్స్ నోటిఫికేషన్ (UPSC Civil Notification) కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్ వచ్చేసింది. 1,056 ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (CSE) 2024 పరీక్షకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఏడాది ప్రవేశ పరీక్షలకు సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఇప్పటికే కీలక ప్రకటన చేసింది. తాజాగా.. తెలంగాణ ఎడ్సెట్ షెడ్యూల్ విడుదల చేసింది. మే 23వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
తెలంగాణలో గ్రూప్-4 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థుల ర్యాంకుల లిస్ట్ ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వెల్లడించింది. గతేడాది జూలైలో గ్రూప్-4 పరీక్షలను టీఎస్పీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. 8,810 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా.. 7 లక్షల 26 వేల 837 మంది అభ్యర్థుల ర్యాంకింగ్ లను ప్రకటించింది. అభ్యర్థులు తమ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/లో ర్యాంకులు చూసుకోవాలని సూచించింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం సెలక్ట్ అయిన వారి షార్ట్ లిస్ట్ ను…