మధ్యప్రదేశ్‌లో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లిలో గుర్రంపై స్వారీ చేస్తున్న వరుడు అకస్మాత్తుగా మరణించాడు. పెళ్లి మండపం దుఃఖంగా మారింది. వధూవరుల కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వధువు ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగిపోయింది. ఈ సంఘటన ప్రస్తుతం రాష్ట్రం, దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Ex Minister Harish Rao: బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు బంధువులపై కేసు నమోదైంది. హరీశ్‌రావు తమ్ముడు మరదలు, మేనమాలు, మరో ముగ్గురిపై మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు బాధితులు.
Love Tragedy: తిరుపతి జిల్లాలోని వెంకటగిరిలో ఓ ప్రేమజంట ఆచూకీ కోసం అబ్బాయి అన్న వదినలను అమ్మాయి తరపు బంధువులు బలవంతంగా తీసుకెళ్లారు. బాలాయపల్లి మండలం కడగుంట గ్రామానికి చెందిన పెంచలయ్య, త్రివేణిల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది.
రోగులపై ఓ వైద్యుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన ఒడిశాలోని కటక్‌లోని ఓ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. కాగా.. ఇద్దరు రోగులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వారి బంధువులు ఆ వైద్యుడిని చితకబాదారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.
రోజురోజుకి సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఓ వైపు క్రైమ్ పోలీసులు సైబర్ నేరాలకు కళ్లెం వేస్తున్నా.. ఇంకోవైపు సైబర్ నేరగాళ్లు కూడా సరికొత్త వ్యూహాలతో ఖాకీలకే సవాళ్లు విసురుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఒక ఐఏఎస్ పేరుతో బంధువుల్ని బురిడీ కొట్టించి నగదు కాజేశారు. ఈ ఘటన జబల్‌పూర్‌లో జరిగింది.
ఇటీవల సోషల్ నెట్‌వర్క్‌లలో పెళ్లికి సంబంధించిన కొన్ని వార్తలు, వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. చాలా మంది వధూవరులు తమ వివాహాన్ని గుర్తుండిపోయేలా చేయడానికి వివిధ రకాల పనులు చేస్తారు. ఈ సమయంలో కొందరు వధూవరులు తమ వింత ప్రవర్తనతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. తాజాగా ఓ పెళ్లికి సంబంధించిన ఓ వింత వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో, వధువు పెళ్లి అంనతరం తమతో వచ్చేందుకు నిరాకరించిందని బంధువులు ఏకంగా కిడ్నాప్ చేసి…
ఇటీవల తానా 2025 - 2027 ప్రెసిడెంట్ గా ఎన్నికైన నరేన్ కు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసిలో తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన ఆధ్వర్యంలో ఆయన ఇంటి వద్ద ఆత్మీయ మిత్రుల మధ్య అభినందన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సతీష్ వేమన మాట్లాడుతూ.. విద్యావేత్త, సౌమ్యుడు అయిన నరేన్ తన కార్యదక్షతతో తానా ఖ్యాతిని మరో స్థాయికి చేర్చి ఇనుమడింపచేయగలడని హర్షం వ్యక్తం చేశారు.
ఏ జబ్బు అయినా ప్రైవేట్ ఆస్పత్రిలో అడుగు పెట్టాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి.. ఇక ప్రసవం కోసం ప్రైవేటుకు వెళ్తే ఎలా? సాధారణ కాన్పు జరిగే పరిస్థితి ఉన్నా.. భయపెట్టి శస్త్రచికిత్సలు చేసి డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. ఇందులో వాస్తవం లేకపోలేదు.. దీంతో, కొందరు అటు ప్రైవేట్‌లో.. ఇటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చూయించుకుంటూ.. డెలివరీ సమయానికి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరితే.. సాధారణ కాన్పునకు ప్రయత్నమైనా చేస్తారనేవారు కూడా ఉన్నారు.. మరోవైపు.. ఆడ పిల్ల పుడితే చీదరించుకునేవాళ్లు కూడా…