Flop Directors : ఈ దర్శకులకు ఛాన్స్ ఇచ్చే హీరోలెవరు.. నెక్ట్స్ మూవీ కన్ఫ్యూజన్లో ఫ్లాప్ డైరెక్టర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో ఒకప్పుడు వరుస హిట్స్‌తో బాక్సాఫీస్‌ను ఏలిన పలువురు స్టార్ డైరెక్టర్లు ప్రస్తుతం ఒక్క ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కించిన ప్రాజెక్ట్‌లు బాక్సాఫీస్ వద్ద ప్లాప్ కావడంతో తమ తదుపరి చిత్రాలను ఏ హీరోతో చెయ్యాలో తెలియక సతమతమవుతున్నారు. ఎంతటి క్రేజీ కాంబినేషన్లయినా కంటెంట్ సరిగా లేకపోతే ప్రేక్షకులు తిరస్కరిస్తుండటంతో ఫ్లాప్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు సైతం వెనకడుగు వేస్తున్నారు.
ఉప్పెన విజయం తర్వాత బుచ్చిబాబు సానా నుంచి వచ్చిన ‘పెద్ది’ చిత్రం తెలుగు వెర్షన్లో ఎలాగోలా బ్రేక్ ఈవెన్ సాధించినప్పటికీ, పాన్ ఇండియా స్థాయిలో మాత్రం భారీ ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో బుచ్చి తదుపరి ప్రాజెక్ట్‌పై నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మరోవైపు ‘ది రాజా సాబ్’తో ప్రభాస్‌ను కనీవిని ఎరుగని రీతిలో చూపిస్తానన్న మారుతి, సినిమా ఫలితం చూసి విమర్శల పాలయ్యారు. కథ సిద్ధంగా ఉన్నప్పటికీ ఆయనకు సరైన హీరో దొరకడం లేదు. దీంతో మళ్లీ తక్కువ బడ్జెట్‌తో చిన్న సినిమా వైపే ఆయన మొగ్గు చూపుతారా అనే చర్చ నడుస్తోంది. ఇక విజయ్ దేవరకొండతో తీసిన ‘ఫ్యామిలీ స్టార్’ దారుణమైన ఫ్లాప్‌గా మారడంతో దర్శకుడు పరశురామ్‌కు ఇప్పటివరకు మరొక అవకాశం ఇచ్చేందుకు ఏ హీరో ముందుకు రావడం లేదు.
Also Read
అవుట్ అండ్ అవుట్ మాస్, యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన బోయపాటి శ్రీనుకి కూడా ప్రస్తుతం కష్టకాలమే నడుస్తోంది. ఆయన మార్క్ అతిగా ఉండే ‘హై ఓల్టేజ్’ ఫార్ములా ఇప్పుడు ఆయనకే శాపంగా మారింది. బాలకృష్ణతో ‘అఖండ 2’ లాంటి సినిమాలకు మాత్రమే ఆ ఫార్ములా వర్కవుట్ అవుతుందేమో కానీ, మిగిలిన హీరోలపై చేస్తే ఫలితం తేడా కొడుతోంది. గతంలో బెల్లంకొండ శ్రీనివాస్‌తో చేసిన ‘జయ జానకి నాయక’, రామ్‌తో తెరకెక్కించిన ‘స్కంద’ చిత్రాలు దారుణమైన ఫ్లాప్‌లుగా నిలవడమే దీనికి నిదర్శనం. బాలయ్యతో తప్ప వేరే ఏ హీరోతో పనిచేయాలన్నా బోయపాటికి ఇప్పుడు ప్రత్యామ్నాయాలు కనిపించడం లేదు. హీరోలకు సరిపడే బలమైన కథలను సిద్ధం చేసుకుని, ప్రేక్షకుల తాజా మైండ్‌సెట్‌కు తగ్గట్టుగా తమ శైలిని మార్చుకుంటేనే ఈ దర్శకులు మళ్లీ ట్రాక్‌లోకి వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Flop Directors : ఈ దర్శకులకు ఛాన్స్ ఇచ్చే హీరోలెవరు.. నెక్ట్స్ మూవీ కన్ఫ్యూజన్లో ఫ్లాప్ డైరెక్టర్స్
-
Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్‌గా రిషభ్ పంత్..
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!