తెలుగు చిత్రసీమలో ‘గురువు గారు’ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది దర్శకరత్న దాసరి నారాయణరావు పేరే! తరువాత చప్పున ఆయన శిష్యగణం కూడా మన స్మృతిపథంలో మెదలుతారు. వారిలో కోడి రామకృష్ణ ముందుగా కనిపిస్తారు. వెనువెంటనే రేలంగి నరసింహారావు గుర్తుకు వస్తారు. ఆ తరువాతే ఎవరైనా! అలా గురువుకు తగ్గ శిష